ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నాయకులకు ప్రధానమంత్రి ధన్యవాదాలు
प्रविष्टि तिथि:
26 JAN 2026 11:12PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రపంచ నాయకులకు ఈ రోజు కృతజ్ఞతలు తెలియజేశారు.
భూటాన్ ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టుకు ప్రధాని స్పందిస్తూ:
‘‘భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని షెరింగ్ తోబ్గేకు, భూటాన్ ప్రజలకు ధన్యవాదాలు. మన దేశాల మధ్య ఉన్న ప్రత్యేక స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నాను.
@tsheringtobgay’’
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు చేసిన పోస్టుకు ప్రధానమంత్రి స్పందిస్తూ:
‘‘భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నా మిత్రుడు అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్‌కు ధన్యవాదాలు. భారత్‌లో మీ పర్యటన కోసం, భారత్-ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం, వైవిద్యీకరించేందుకు ఎదురుచూస్తున్నాను.
@EmmanuelMacron’’
సైప్రస్ అధ్యక్షుడు చేసిన పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ:
‘‘అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడ్యులీడీస్.. మీరందించిన ఆత్మీయ శుభాకాంక్షలకు ధన్యవాదాలు. సన్నిహిత మిత్రునిగా, విశ్వసనీయ భాగస్వామిగా ఉన్న సైప్రస్‌తో మా సమగ్ర భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నాం. భారత్‌లో మీ పర్యటన కోసం ఎదురుచూస్తున్నాను.
@Christodulides’’
మాల్దీవుల అధ్యక్షుడు చేసిన పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ..
‘‘అధ్యక్షుడు మయిజ్జు... భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీరందించిన శుభాకాంక్షలు, అభినందనలకు ధన్యవాదాలు. ఇరుదేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చేస్తున్న కృషిని మనం కొనసాగిద్దాం. రాబోతున్న పండగ సీజన్ నేపథ్యంలో మీకు, మా మాల్దీవుల మిత్రులకు శుభాకాంక్షలు.
@MMuizzu’’
(रिलीज़ आईडी: 2219170)
आगंतुक पटल : 5