ప్రధాన మంత్రి కార్యాలయం
గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తిదాయకం
మన రాజ్యాంగ ప్రత్యేకతను సముచితంగా స్పష్టం చేసిన రాష్ట్రపతి
ప్రజాస్వామ్య బలోపేతం, రాజ్యాంగ ఆదర్శాలను నిలబెట్టడం, వికసిత్ భారత్ నిర్మాణం కోసం ఈ ప్రసంగం పౌరులకు స్ఫూర్తినిస్తుంది: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
25 JAN 2026 9:30PM by PIB Hyderabad
గణతంత్ర దినోత్సవ సందర్భంగా గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
భారత రాజ్యాంగ ప్రత్యేకతను రాష్ట్రపతి సముచితంగా స్పష్టం చేశారని తెలిపారు. దేశాన్ని ముందుకు నడిపించిన సమష్టి స్ఫూర్తిని ఆమె ప్రశంసించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య బలోపేతం, రాజ్యాంగ ఆదర్శాలను నిలబెట్టడం, వికసిత్ భారత్ నిర్మాణం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించడం కోసం ఆమె ప్రసంగం ప్రతి పౌరుడికీ స్ఫూర్తినిస్తుందని ఆయన తెలిపారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"గణతంత్ర దినోత్సవ సందర్భంగా గౌరవనీయ రాష్ట్రపతి చేసిన ప్రసంగం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆమె మన రాజ్యాంగ ప్రత్యేకతను సముచిత రీతిలో స్పష్టం చేశారు. మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన సమష్టి స్ఫూర్తిని ప్రశంసించారు. ప్రజాస్వామ్య బలోపేతం, రాజ్యాంగ ఆదర్శాలను నిలబెట్టడం, వికసిత్ భారత్ నిర్మాణం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించడం కోసం ఆమె ప్రసంగం ప్రతి పౌరుడికీ స్ఫూర్తినిస్తుంది.
@rashtrapatibhvn”
(रिलीज़ आईडी: 2218694)
आगंतुक पटल : 8