ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2026 పద్మ అవార్డు గ్రహీతలను అభినందించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 25 JAN 2026 7:16PM by PIB Hyderabad

దేశానికి విశేష సేవలందించిన పద్మ పురస్కార గ్రహీతలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

 

వివిధ రంగాల్లో వారు చూపిన ప్రతిభ, అంకితభావం,సేవలు మన సమాజాన్ని సుసంపన్నం చేస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ గౌరవం వారి నిబద్ధతకు నిదర్శనమని, ఇది రాబోయే తరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తుందని ఆయన అన్నారు.

 

2026 పద్మ అవార్డులను ప్రకటించిన ఎక్స్‌ ఖాతా పోస్టుకు స్పందిస్తూ ప్రధానమంత్రి ఇలా అన్నారు.

 

‘‘మన దేశానికి విశిష్ట సేవలందించిన పద్మ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు. విభిన్న రంగాలలో వారి ప్రతిభ, అంకితభావం, సేవాభావం మన సమాజ నిర్మాణాన్ని సుసంపన్నం చేస్తాయి. ఈ గౌరవం వారిలోని అంకితభావం, శ్రేష్ఠతను ప్రతిబింబిస్తోంది. ఇది రాబోయే తరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుంది’’.


(रिलीज़ आईडी: 2218693) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Gujarati