సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశ కథా సంప్రదాయాలను, వేవ్స్ దార్శనికతను ప్రదర్శించనున్న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శకటం


ఓంకారం నుంచి అల్గోరిథం వరకు: వికసిస్తున్న భారత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించనున్న శకటం

प्रविष्टि तिथि: 22 JAN 2026 6:40PM by PIB Hyderabad

ఈ నెల 26 వ తేదీన ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో “భారత గాథశ్రుతికృతిదృష్టి ఇతివృత్తంతో సమాచార,  ప్రసార మంత్రిత్వశాఖ ప్రదర్శించే శకటం ప్రాచీన మౌఖిక సంప్రదాయాల నుంచి ప్రపంచ స్థాయి కంటెంట్,  మీడియా శక్తిగా ఎదిగిన భారతదేశ నాగరికతా ప్రయాణాన్ని కథన రూపంలో శక్తిమంతంగా ఆవిష్కరిస్తుందిఈ శకటం ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూసాంస్కృతిక వారసత్వాన్ని సాంకేతిక నవోన్నతులతో సమన్వయంగా మేళవించిన అద్భుత దృశ్య రూపాన్ని అందిస్తుంది.

శ్రుతి అనేది భారతదేశ సమృద్ధమైన మౌఖిక సంప్రదాయ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందిఈ భాగంలోరావి చెట్టు నీడన గురుశిష్యులకు జ్ఞానాన్ని బోధిస్తున్న దృశ్యం ద్వారా శ్రుతి ఆవిష్కృతమవుతుందిఅదే సమయంలోఓంకారానికి సంబంధించిన బ్రహ్మాండ ధ్వని ప్రతిధ్వనినిజ్ఞాన ఉద్భవాన్ని సూచించే ధ్వని తరంగాల రూపకాలు ఈ చిత్రణకు తోడ్పడుతూభారతీయ జ్ఞాన పరంపర మూలాలను ప్రతిఫలింపజేస్తాయి.

కృతి అనేది భారతీయ లిఖిత రూప వ్యక్తీకరణ పరిణామాన్ని ప్రతిబింబిస్తుందిఈ భాగంలో భగవాన్ గణేశుడు మహాభారతాన్ని లిఖిస్తున్న దృశ్యం ద్వారా లిఖిత రూప కళలోని ప్రాముఖ్యతను చూపిస్తారుఇంకా ప్రాచీన పత్రికలుసంగీ తంనాట్యంనృత్యం వంటి ప్రదర్శన కళలుప్రారంభంలోని కమ్యూనికేషన్ సంప్రదాయాల ద్వారా భారతీయ జ్ఞాన సంపత్తి సాంస్కృతిక వారసత్వం ఎలా రూపుదిద్దుకున్నదో వివరిస్తారు.

దృష్టివిభాగం ముద్రణ (ప్రింట్), సినిమాటెలివిజన్డిజిటల్ వేదికల ద్వారా భారత మీడియా రంగం పరిణామాన్ని కళ్లకు కడుతుందిపాతకాలపు కెమెరాలుఫిల్మ్ రీల్స్ఉపగ్రహాలువార్తాపత్రికలుబాక్సాఫీస్ చిహ్నాలు వంటి దృశ్యరూపాల ద్వారా భారత సాంస్కృతిక మూలాలను తీర్చిదిద్దిన తరతరాల చలనచిత్ర నిర్మాతలుకళాకారులకు గౌరవవందనం సమర్పిస్తారుఈ శకటం కృత్రిమ మేధఏవీజీసీ ఎక్స్ ఆర్ (యానిమేషన్విజువల్ ఎఫెక్ట్స్గేమింగ్కామిక్స్ ఎక్స్‌టెండెడ్ రియాలిటీ),  వర్చువల్ ప్రొడక్షన్ సాంకేతికతల ద్వారా భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా ఉన్న కథా సంప్రదాయాలను కూడా ప్రముఖంగా తెలియచేస్తుందిప్రేక్షకులు కథలో పూర్తిగా లీనమైపోయేలా చేసే  సరికొత్త విధానంలోకి మారుతున్న ధోరణిని కూడా చూపిస్తుంది

వివిధ రూపాల ప్రదర్శనకారులు తమ ప్రదర్శనలతో ఈ శకటానికి జీవం పోశారు. 2025లో జరిగిన 'వేవ్స్'  సదస్సు చేకూర్చిన బలంతో గ్లోబల్ కంటెంట్ పరంగా భారత్ ను ప్రపంచ కేంద్రంగా నిలపాలనే తీర్చిదిద్దాలనే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ లక్ష్యానికి అనుగుణంగా ఈ శకట ఇతివృత్తం రూపుదిద్దుకుందిభారీ అంతర్జాతీయ భాగస్వామ్యంగణనీయమైన వ్యాపార ఒప్పందాలతో జరిగిన వేవ్స్ సదస్సు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ (ఆరెంజ్ ఎకానమీఆవిర్భావానికి ఒక సంకేతంగా నిలిచింది.

ఈ శకటం భారత పురాతన విజ్ఞానాన్నిడిజిటల్ భవిష్యత్తును ఏకం చేస్తూఅటు సాంస్కృతిక కాలక్రమానికిఇటు భవిష్యత్ దార్శనికతకు నిదర్శనంగా నిలుస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2217482) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Khasi , English , Marathi , हिन्दी , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam