మంత్రిమండలి
అటల్ పింఛను యోజన (ఏపీఐ) కొనసాగింపు.. ప్రోత్సాహక - అభివృద్ధి కార్యకలాపాలు, లోటు నిధుల భర్తీ కోసం ఆర్థిక చేయూతను 2030-31 పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం
प्रविष्टि तिथि:
21 JAN 2026 12:14PM by PIB Hyderabad
అటల్ పింఛను యోజన (ఏపీవై)తోపాటు, పథకం ప్రోత్సాహక- అభివృద్ధి కార్యకలాపాలు, లోటు నిధుల భర్తీ కోసం ఆర్థిక చేయూతను 2030-31 వరకు కొనసాగించేందుకు.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపింది.
అమలు వ్యూహం:
కింది అంశాల్లో ప్రభుత్వ మద్దతుతో 2030-31 వరకు ఈ పథకం కొనసాగుతుంది:
-
- అసంఘటిత రంగ కార్మికులకు ఈ పథకాన్ని మరింత చేరువ చేసేలా ప్రోత్సాహక, అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టడం. ఇందులో భాగంగా అవగాహన, సిబ్బందికి నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు నిర్వహించడం.
- లోటు నిధుల భర్తీ (గ్యాప్ ఫండింగ్) ద్వారా.. పథకాన్ని ఆచరణ సాధ్యంగా నిలపడం, దీర్ఘకాలం నిలకడగా కొనసాగేలా చూడడం.
ప్రధాన ప్రభావం:
- లక్షలాది మంది అల్పాదాయ, అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో ఆదాయ భద్రతను అందిస్తుంది.
- ఆర్థిక సమ్మిళితత్వాన్ని పెంపొందిస్తుంది. అలాగే పింఛను భద్రత ఉన్న సమాజంగా మారే దిశగా భారత్‌కు చేయూతనిస్తుంది.
- ఎప్పటికప్పుడు సామాజిక భద్రతను అందించడం ద్వారా వికసిత భారత్ @2047 లక్ష్యాన్ని బలోపేతం చేస్తుంది.
నేపథ్యం:
- ప్రారంభం: అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో ఆదాయ భద్రతను అందించే లక్ష్యంతో 2015 మే 9న అటల్ పింఛను యోజన పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
- పథకం ముఖ్యాంశాలు: చెల్లించిన వాటాలను బట్టి.. 60 ఏళ్ల వయస్సు నుంచి నెలకు కనీసం రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పింఛను భరోసాను అందిస్తుంది.
- పురోగతి: 2026 జనవరి 19 నాటికి 8.66 కోట్లకు పైగా చందాదారులు ఏపీవైలో నమోదు చేసుకున్నారు. దేశ సమ్మిళిత సామాజిక భద్రతా వ్యవస్థకు మూలస్తంభంగా ఈ పథకం నిలిచింది.
- పొడిగించాల్సిన ఆవశ్యకత: అంతరాయం లేకుండా పథకం కొనసాగాలంటే.. ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక లోటును భర్తీ చేయడంలో ప్రభుత్వ నిరంతర చేయూత అత్యావశ్యకం.
***
(रिलीज़ आईडी: 2216784)
आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
Odia
,
Manipuri
,
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam