ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శక్తిమంతమైన భారత అంకురావరణ వ్యవస్థను ప్రముఖంగా వివరించే వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


· సార్వజనీన వ్యవస్థలో సృజనకర్తల ఎదుగుదలతోపాటు వికసిత భారత్ దిశగా అపార అవకాశాల అన్వేషణకు ఇది తోడ్పడుతుందని యువతకు సూచన

प्रविष्टि तिथि: 16 JAN 2026 12:34PM by PIB Hyderabad

దేశంలోని శక్తిమంతమైన అంకురావరణ వ్యవస్థ గురించి ప్రముఖంగా వివరిస్తూ, సార్వజనీన వ్యవస్థలో సృజనకర్తల ఎదుగుదలతోపాటు వికసిత భారత్ లక్ష్యసాధన దిశగా అపార అవకాశాల అన్వేషణకు తోడ్పడే ఒక కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ యువతతో పంచుకున్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో కేంద్ర మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ పోస్టుపై స్పందిస్తూ పంపిన సందేశంలో:

“ఒకనాడు దేనికోసమైతే యువత అన్వేషిస్తూ వచ్చారో నేటి భారత్‌లో తమ ఆకాంక్షల సాకారంపై విశ్వాసంతో దాన్ని వారే సృష్టిస్తున్నారు! ఈ కథనంలో కేంద్రమంత్రి శ్రీ పీయూష్‌గోయల్‌ @PiyushGoyal దేశంలోని శక్తిమంతమైన అంకురావరణ వ్యవస్థ గురించి విశదీకరించారు. సార్వజనీన వ్యవస్థలో సృజనకర్తల ఎదుగుదలకు, వికసిత భారత్ దిశగా అపార అవకాశాల అన్వేషణకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది...

ఈ కథనాన్ని తప్పక చదవండి!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

****


(रिलीज़ आईडी: 2215483) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam