హోం మంత్రిత్వ శాఖ
స్వామి వివేకానందుని జయంతి సందర్భంగా కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా నివాళి:
‘జాతీయ యువజన దినోత్సవం’ సందర్భంగా దేశ పౌరులకు శుభాకాంక్షలు
లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించకూడదన్న స్వామి వివేకానంద బోధనలు..
యువతలో బాధ్యతను, దేశభక్తిని నింపుతూ, అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధనను వేగవంతం చేస్తున్నాయి
భారతీయ విజ్ఞాన సంప్రదాయం, తత్వశాస్త్రం, ఆధ్యాత్మితకతో దేశ యువతను అనుసంధానించి వాటిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన స్వామి వివేకానంద
రామకృష్ణ మిషన్ ద్వారా సామాజిక సేవా ఆదర్శాలను నెలకొల్పిన స్వామి వివేకానంద
प्रविष्टि तिथि:
12 JAN 2026 11:14AM by PIB Hyderabad
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు నివాళులు అర్పించారు. అలాగే జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించకూడదన్న స్వామి వివేకానంద బోధనలు.. యువతలో బాధ్యతను, దేశభక్తిని నింపుతున్నాయని, అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధనను వేగవంతం చేస్తున్నాయని తెలిపారు.
‘‘స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పౌరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతీయ విజ్ఞాన సంప్రదాయం, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికతతో దేశ యువతను స్వామి వివేకానంద అనుసంధానించారు. అంతర్జాతీయ వేదికలకు వాటిని తీసుకెళ్లారు. రామకృష్ణ మిషన్ ద్వారా సామాజిక సేవా ఆదర్శాలను ఆయన నెలకొల్పారు. లక్ష్యాన్ని సాధించేంత వరకు విశ్రమించకూడదనే స్వామీజీ బోధనలు దేశ యువతలో బాధ్యతను, దేశభక్తిని నింపుతున్నాయి. అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధనను వేగవంతం చేస్తున్నాయి’’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2215031)
आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam