ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఈ ఏడాది పరీక్షా పే చర్చ కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆలోచనలను ఆహ్వానించిన ప్రధాని

प्रविष्टि तिथि: 07 JAN 2026 7:05PM by PIB Hyderabad

పదిపన్నెండో తరగతుల బోర్డు పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరోసారి విద్యార్థులుతల్లిదండ్రులుఉపాధ్యాయులతో సంభాషించనున్నారు.

ఈ సందర్భంగా స్ఫూర్తిదాయకమైన తమ ప్రశ్నలుఆలోచనలుఅనుభవాలను పంచుకోవాలని దేశంలోని #ExamWarriors అందరినీ ప్రధానమంత్రి ఆహ్వానించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

పదిపన్నెండో తరగతుల పరీక్షలు దగ్గరపడుతున్నాయిఅలాగే ఈ ఏడాది #ParikshaPeCharcha కూడా సమీపిస్తోంది!

పరీక్షలకు సంబంధించి వివిధ అంశాలపై విద్యార్థులుతల్లిదండ్రులుఉపాధ్యాయులతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానుముఖ్యంగా పరీక్షల ఒత్తిడిని అధిగమించే మార్గాలతోపాటు ప్రశాంతంగాఆత్మవిశ్వాసంతో ఉంటూ చిరునవ్వుతో పరీక్షలకు హాజరవడం వంటి విషయాలపై వారితో సంభాషించాలనుకుంటున్నాను.

ప్రశ్నల రూపంలోగానీవారి అనుభవాల ద్వారాగానీ #ExamWarriors తో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానుఅవి ఇతరుల్లో స్ఫూర్తిని నింపుతాయి.

https://innovateindia1.mygov.in/


(रिलीज़ आईडी: 2212267) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam , Malayalam