ప్రధాన మంత్రి కార్యాలయం
జనవరి 4న వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
పోటీలో పాల్గొననున్న వివిధ రాష్ట్రాలు, సంస్థలకు చెందిన వహిస్తున్న 58 జట్లు, 1000 మందికి పైగా క్రీడాకారులు
प्रविष्टि तिथि:
03 JAN 2026 2:41PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జనవరి 4 మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 72వ జాతీయ వాలీబాల్ టోర్నమెంటును ప్రారంభించనున్నారు. వారణాసిలోని డాక్టర్ సంపూర్ణానంద్ క్రీడా మైదానంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగనుంది.
జనవరి 4 నుంచి 11 వరకు జరిగే ఈ టోర్నమెంట్‌లో దేశం నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు. వివిధ రాష్ట్రాలు, సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 58 జట్ల నుంచి 1,000 మందికి పైగా క్రీడాకారులు పోటీపడనున్నారు. భారత వాలీబాల్‌లో ఉన్నత స్థాయి ప్రమాణాలు, క్రీడా స్ఫూర్తి, ప్రతిభను ఈ పోటీలు ప్రదర్శించనున్నాయి.
72వ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్‌ను వారణాసిలో నిర్వహించడం... నగరంలో క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, క్రీడాకారుల అభివృద్ధికి పెరుగుతున్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తుంది.ఇప్పటికే సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందుతున్న వారణాసి.. ఇప్పుడు ఇలాంటి జాతీయ స్థాయి క్రీడా కార్యక్రమాల నిర్వహణ ద్వారా ఒక కీలక వేదికగా తన గుర్తింపును మరింత పెంచుకుంటోంది.
***
(रिलीज़ आईडी: 2211489)
आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
Tamil
,
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Kannada
,
Malayalam