మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మూడు కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లతో కొత్త రికార్డును నెలకొల్పిన పరీక్షా పే చర్చా

प्रविष्टि तिथि: 31 DEC 2025 8:47AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం పరీక్షా పే చర్చాలో పాలుపంచుకోవడానికి 2025 డిసెంబరు 30 కల్లా కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యాయి.  ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విద్యార్థులుతల్లితండ్రులుఉపాధ్యాయులు పేర్లను నమోదు చేసుకున్నారు.

విద్యార్థుల మానసిక సమతుల్యతకు పరీక్షా పే చర్చా ఉపయోగపడటంతో ఈ కార్యక్రమానికి అంతకంతకూ ప్రజాదరణ పెరుగుతోందిపరీక్షలంటే విద్యార్థుల్లో సానుకూల వైఖరిని పెంచుతూవారు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయడానికి సన్నద్ధం అయ్యేటట్లు వారిని ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తోందిపరీక్షా పే చర్చా ఒక సిసలైన ప్రజా ఉద్యమంగా రూపొందిందని ఈ కార్యక్రమంలో భాగం పంచుకొంటున్న వారి సంఖ్య స్పష్టం చేస్తోందిపరీక్షా పే చర్చా పట్ల దేశం నలుమూలలా విద్యార్థుల్లోగురువుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది.
పరీక్షా పే చర్చా లో పాల్గొనడానికి ఆన్‌లైన్ మాధ్యమంలో రిజిస్ట్రేషన్లు మైగవ్ పోర్టల్‌లో 2025 డిసెంబరు 1న ప్రారంభించారువిద్యా మంత్రిత్వ శాఖకు చెందిన పాఠశాల విద్యఅక్షరాస్యత విభాగం ఏటా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జ్ఞానార్జనతో పాటు చర్చలో పాల్గొనడానికి ఎంతో మంది చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారువారిలో విద్యార్థులుతల్లితండ్రులతో పాటు ఉపాధ్యాయులు ఉంటున్నారువారందరికీ ఇది ఒక ఉమ్మడి వేదికగా రూపొందింది.

పరీక్షా పే చర్చా 2026లో పాల్గొనడానికి:
https://innovateindia1.mygov.in/ లో నమోదు చేసుకోవచ్చు.

 

***


(रिलीज़ आईडी: 2210084) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , Assamese , Bengali-TR , English , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam