హోం మంత్రిత్వ శాఖ
రతన్ టాటా జయంతి సందర్భంగా నివాళులర్పించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
నిజాయితీ, కరుణతో భారతీయ సంస్థలను పునర్నిర్మించిన రతన్ టాటా: కేంద్ర హోం మంత్రి
స్వదేశీ పరిశ్రమను నిర్మించటం నుంచి నిస్వార్థ దాతృత్వం వరకు
నిజమైన విజయం దేశ సేవలోనే ఉందని నిరూపించిన శ్రీ రతన్ టాటా: కేంద్ర హోం మంత్రి
స్వయం సమృద్ధ భారతావనికి స్ఫూర్తినిస్తున్న శ్రీ రతన్ టాటా వారసత్వం: కేంద్ర హోం మంత్రి
प्रविष्टि तिथि:
28 DEC 2025 1:28PM by PIB Hyderabad
నిజాయితీ, కరుణతో భారతీయ సంస్థలను పునర్నిర్మించిన రతన్ టాటా జయంతి సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర హోం మంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:
“నిజాయితీ, కరుణతో భారతీయ సంస్థలను పునర్నిర్మించిన రతన్ టాటా గారికి ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. స్వదేశీ పరిశ్రమను నిర్మించడం నుంచి నిస్వార్థ దాతృత్వం వరకు నిజమైన విజయం దేశ సేవలోనే ఉందని ఆయన నిరూపించారు. ఆయన వారసత్వం స్వయం సమృద్ధ భారతావనికి స్ఫూర్తినిస్తుంది.”
(रिलीज़ आईडी: 2209286)
आगंतुक पटल : 4