రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి

प्रविष्टि तिथि: 26 DEC 2025 1:25PM by PIB Hyderabad

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ఈ రోజు (2025, డిసెంబర్ 26) న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారుధైర్యసాహసాలుసామాజిక సేవపర్యావరణంక్రీడలుకళలు-సంస్కృతి రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన చిన్నారులకు వీటిని అందించారు.


ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను అందుకున్న వారిని అభినందించారుఈ పురస్కారాలు గెలుచుకున్న బాలలు తమ కుటుంబాలకుసమాజానికిదేశం మొత్తానికి గర్వకారణమన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న చిన్నారులకు ఈ పురస్కారాలు స్ఫూర్తినిస్తాయనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారువారిని ప్రోత్సహించేందుకే ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్టు ఆమె చెప్పారు.

.

భారతీయులందరూ గౌరవించే సిక్కుల పదో గురువైన గురు గోవింద్ సింగ్ఆయన నలుగురు కుమారులు దాదాపు 320 ఏళ్ల క్రితం.. సత్యంన్యాయం కోసం పోరాడుతూ తమ ప్రాణాలను త్యాగం చేశారని రాష్ట్రపతి అన్నారుపిన్న వయస్కులైన ఇద్దరు సాహిబ్‌జాదాల ధైర్యాన్ని దేశవిదేశాల్లో కీర్తిస్తారని ఆమె అన్నారుసత్యంన్యాయం కోసం తమ ప్రాణాలను అర్పించిన బాల యోధులను ఆమె స్మరించుకున్నారు.

 

చిన్నారుల్లో దేశభక్తిఉన్నత ఆదర్శాలు ఉన్నప్పుడే ఆ దేశం గొప్పగా మారుతుందని రాష్ట్రపతి అన్నారుధైర్యసాహసాలుకళలు-సంస్కృతిపర్యావరణంఆవిష్కరణలుశాస్త్ర సాంకేతికతసామాజిక సేవక్రీడలు తదితర రంగాల్లో చిన్నారులు అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారుఏడేళ్ల వాకా లక్ష్మీ ప్రాజ్ఞిక లాంటి చిన్నారుల వల్ల అంతర్జాతీయ యవనికపై చదరంగంలో శక్తిమంతమైనదిగా భారత్‌ను పరిగణిస్తున్నారని అన్నారుతమ ధైర్యంతెలివితేటలతో అజయ్ రాజ్మహ్మద్ సిడాన్ పీ అనేక మంది ప్రాణాలు కాపాడారనివారు ప్రశంసలకు అర్హులని అన్నారుఇతరుల ప్రాణాలను కాపాడే క్రమంలో ధైర్యవంతులైన తొమ్మిదేళ్ల వ్యోమ ప్రియపదకొండేళ్ల కమలేష్ కుమార్ మరణించారుఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నప్పటికీ పదేళ్ల శ్రవణ్ సింగ్ తన ఇంటికి సమీపంలోని దేశ సరిహద్దుల్లో ఉన్న భారతీయ సైనికులకు క్రమం తప్పకుండా నీరుపాలులస్సీ అందించాడు. దివ్యాంగ బాలిక అయిన శివానీ హోసూరు ఉప్పర తన ఆర్థికశారీరక పరిమితులను అధిగమించి క్రీడా రంగంలో అద్భుతమైన విజయాలను సాధించిందిపోటీప్రతిభావంతులు అధికంగా ఉండే క్రికెట్ ప్రపంచంలో వైభవ్ సూర్యవంశీ తనకంటూ ఓ పేరును సంపాదించుకొని అనేక రికార్డులు నెలకొల్పాడుఇలాంటి ధైర్యవంతులుప్రతిభావంతులైన చిన్నారులు మంచి పనిని కొనసాగిస్తూ.. భారత భవిష్యత్తును ఉజ్వలంగా చేస్తారనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు.

 

రాష్ట్రపతి పూర్తి ప్రసంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

***


(रिलीज़ आईडी: 2208864) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam