హోం మంత్రిత్వ శాఖ
మాజీ ప్రధానమంత్రి, బీజేపీ వ్యవస్థాపకులు, భారతరత్న గౌరవ అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా దేశం తరపున ఆయనకు ఘన నివాళులు అర్పించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
జాతీయ ప్రయోజనాలకు, సాంస్కృతిక జాతీయ వాదానికి ప్రాధాన్యతనిచ్చే రాజకీయ ప్రత్యామ్నాయాన్ని బీజేపీ స్థాపనతో భారత రాజకీయాలకు అందించిన అటల్ జీ
అణుశక్తి నుంచి సుపరిపాలన వరకు దేశానికి అగ్రగామి పాలనా నమూనాను అందించిన అటల్ జీ నాయకత్వంలో వారసత్వం, విజ్ఞానం మేళమింపుగా పాలనను అందిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం
భారత రాజకీయాల్లో ఒక శక్తిమంతమైన, చిరస్మరణీయ వ్యక్తి అటల్ జీ.. ప్రజాసేవ పట్ల అంకిత భావం, సంస్థాగత బలం ఆయన ప్రత్యేకత
प्रविष्टि तिथि:
25 DEC 2025 12:04PM by PIB Hyderabad
మాజీ ప్రధానమంత్రి, బీజేపీ వ్యవస్థాపకులు, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా దేశం తరపున కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఘన నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు. బీజేపీ స్థాపన ద్వారా జాతీయ ప్రయోజనాలకు, సాంస్కృతిక జాతీయవాదానికి ప్రాధాన్యతనిచ్చే రాజకీయ ప్రత్యామ్నాయాన్ని భారత రాజకీయాలకు అటల్ జీ అందించారని పేర్కొన్నారు. భారత్‌ను అణుశక్తి దేశంగా తీర్చిదిద్దటమే కాక, సుపరిపాలనను సాకారం చేయటంలో ఆయన నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశానికి అద్భుతమైన పాలనా నమూనాను అందించిందన్నారు. అది వారసత్వంతో పాటు విజ్ఞాన శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్లిందని చెప్పారు. ప్రజాసేవ పట్ల అంకితభావం, అజేయమైన సంస్థాగత శక్తికి మారుపేరుగా నిలిచిన అటల్ జీ.. భారత రాజకీయాల్లో ఒక శక్తిమంతమైన, చిరస్మరణీయ వ్యక్తి అని శ్రీ అమిత్ షా కొనియాడారు.
(रिलीज़ आईडी: 2208588)
आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam