హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నక్సల్ రహిత భారత్ దిశగా కీలక ముందడుగు


ఒడిశాలోని కంధ్మాల్‌లో నిర్వహించిన ఆపరేషన్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఉయ్కే సహా 6 గురు నక్సలైట్లు హతం

ఈ కీలక పురోగతితో నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తి పొందేందుకు చేరువలో ఒడిశా

2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని మేం దృఢంగా నిర్ణయించుకున్నాం

నాడు పోస్టు చేయడమైనది: 25 DEC 2025 4:35PM by PIB Hyderabad

నక్సల్ రహిత భారత్ దిశగా కీలక ముందడుగు వేస్తూ ఒడిశాలోని కంధ్మాల్‌లో నిర్వహించిన ప్రధాన ఆపరేషన్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఉయ్కే సహా ఇప్పటివరకు 6 గురు నక్సలైట్లు హతమయ్యారు.

‘ఎక్స్’ వేదికగా హోంమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

“నక్సల్ రహిత భారత్ దిశగా ఒక కీలక ముందడుగు పడింది. ఒడిశాలోని కంధ్మాల్‌లో నిర్వహించిన ఒక ప్రధాన ఆపరేషన్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఉయ్కే సహా 6 గురు నక్సలైట్లు ఇప్పటివరకు హతమయ్యారు. ఈ కీలక పురోగతితో ఒడిశా నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తి పొందేందుకు చేరువలో ఉంది. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని మేం నిశ్చయించుకున్నాం.”


(రిలీజ్ ఐడి: 2208582) సందర్శకుల సూచీ సంఖ్య : : 58
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam