ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇథియోపియాలోని అడిస్అబాబాలో అడ్వా విజయ స్మారకం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 17 DEC 2025 1:44PM by PIB Hyderabad

అడిస్అబాబాలోని అడ్వా విజయ స్మారకం వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పుష్పగుచ్ఛం ఉంచి, శ్రద్ధాంజలి ఘటించారు. 1896లో జరిగిన అడ్వా యుద్ధంలో తమ దేశ సార్వభౌమత్వం కోసం ప్రాణాలర్పించిన ఇథియోపియన్ వీర సైనికుల స్మారకార్థం దీనిని నిర్మించారు. అడ్వా వీరుల చిరతర స్ఫూర్తికీ, దేశం గర్వించదగిన స్వతంత్రత, వైశిష్ట్యం, చేతనా పరంపరకు ఈ స్మారకం ప్రతీక.

ఈ స్మారకానికి ప్రధానమంత్రి సందర్శన.. భారత్, ఇథియోపియాల మధ్య గల ప్రత్యేక చారిత్రక సంబంధాలను చాటుతోంది. ఇరుదేశాల ప్రజల ఆదరణతో ఈ సంబంధాలు నిరంతరం కొనసాగుతున్నాయి.


(రిలీజ్ ఐడి: 2205181) సందర్శకుల సూచీ సంఖ్య : : 43