ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

కోల్‌సేతు విండో‌ను ఆమోదించిన కేంద్ర క్యాబినెట్


బొగ్గును పారదర్శకంగా అందుబాటులో ఉంచటంతో పాటు వనరులను అత్యుత్తమంగా ఉపయోగించేలా చూసుకునేందుకు వివిధ పారిశ్రామిక ఉపయోగాలు, ఎగుమతుల కోసం బొగ్గు లింకేజీల వేలం

प्रविष्टि तिथि: 12 DEC 2025 4:18PM by PIB Hyderabad

బొగ్గు పారిశ్రామిక వినియోగంఎగుమతి కోసం ఉద్దేశించిన కోల్‌సేతు (కోల్ లింకేజ్ ఫర్ సీమ్‌లెస్ఎఫిషియంట్ అండ్ ట్రాన్స్‌పరెంట్ యుటిలైజేషన్విధానానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదించిందిదీని ప్రకారం ఎన్ఆర్ఎస్ లింకేజ్ విధానంలో కోల్‌‍సేతు అనే విండోను కొత్తగా తీసుకురానున్నారుబొగ్గు రంగంలో ప్రభుత్వం చేపడుతోన్న వరుస సంస్కరణల్లో ఈ కొత్త విధానం ఒక భాగంగా ఉంది.

 

2016 ఎన్ఆర్ఎస్ (అనియంత్రిత రంగాలులింకేజ్ వేలం విధానంలో కోల్‌సేత్ అనే ప్రత్యేక విండోను కొత్తగా తీసుకురావటం ద్వారా వేలం ఆధారంగా దీర్ఘకాలిక ప్రాతిపదికన బొగ్గు లింకేజీలను అన్ని రకాల పారిశ్రామిక వినియోగంఎగుమతి కోసం కేటాయించడానికి ఇది అనుమతిస్తుందిఈ వేలంలో బొగ్గు అవసరం ఉన్న అన్ని రకాల దేశీయ కొనుగోలుదారులు పాల్గొనవచ్చుఈ విండో కింద కోకింగ్ కోల్‌ లేదు.

 

ఎన్ఆర్ఎస్‌ బొగ్గు లింకేజీల వేలం విషయంలో ఇప్పటికే ఉన్న విధానం ప్రకారం అన్ని కొత్త బొగ్గు లింకేజీలను సీపీపీ (సొంత బొగ్గు గనులు ఉండే విద్యుతుత్పత్తి కేంద్రాలుకంపెనీలతో సహా ఎన్ఆర్ఎస్‌లకు (అంటే సిమెంట్స్టీల్ (కోకింగ్), స్పాంజ్ ఐరన్అల్యూమినియంఎరువులు(యూరియామినహా ఇతరులువేలం ఆధారంగా కేటాయిస్తారుఈ ఎన్ఆర్ఎస్ లింకేజ్ విధానం ప్రకారం నిర్దిష్ట తుది వినియోగదారులకే ఉప-రంగాల కేటాయింపులు ఉంటాయి.

 

ప్రస్తుత, భవిష్యత్తు మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వ్యాపార సౌలభ్యంతో పాటు ఇప్పటికే ఉన్న బొగ్గు నిల్వల వినియోగాన్ని వేగవంతం చేసేందుకుదేశ ఇంధన అవసరాలను తీర్చే విషయంలో దిగుమతి అయిన బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు అనియంత్రిత రంగాలకు బొగ్గు సరఫరా విషయంలో ఉన్న ప్రస్తుత విధానాన్ని సమీక్షించాల్సిన అవసరం ఏర్పడిందిఅలాగే ఎన్ఆర్ఎస్‌లోని లింకేజ్‌లను ఎటువంటి తుది వినియోగ పరిమితులు లేకుండా బొగ్గు వినియోగదారులకు విస్తరించాల్సిన అవసరం ఉందివాణిజ్య గనుల తవ్వకం కోసం బొగ్గు రంగాన్ని తెరిచేందుకు ఎటువంటి తుది వినియోగ పరిమితులు లేకుండా బొగ్గు బ్లాకుల కేటాయింపునకు ఇది అనుమతిస్తుందిఏదైనా పారిశ్రామిక వినియోగంఎగుమతి కోసం వేలం ఆధారంగా దీర్ఘకాలిక ప్రాతిపదికన బొగ్గు లింకేజీలను కేటాయించడానికి మరొక విండో లేదా ఉప-రంగాన్ని ఈ విధానం తీసుకొస్తుందిఈ ప్రతిపాదిత విండోలో వ్యాపారులు పాల్గొనరాదుఎన్ఆర్ఎస్‌లోని నిర్దిష్ట తుది-వినియోగదారులకు సంబంధించిన ఉప-రంగాలకు ఉన్న ప్రస్తుత బొగ్గు లింకేజ్‌ల వేలం కొనసాగుతుందిఆ నిర్దిష్ట తుది-వినియోగదారులు కూడా కోల్‌సేతు విండోలో పాల్గొనవచ్చు.

ఈ విండో కింద పొందిన బొగ్గు లింకేజ్‌లను దేశంలో తిరిగి విక్రయించరాదుసొంత వినియోగంబొగ్గు ఎగుమతి లేదా మరేదైనా ప్రయోజనం (కోల్ వాషింగ్‌తో సహాకోసం ఉపయోగించుకోవచ్చుబొగ్గు లింకేజ్‌లు పొందిన సంస్థలు బొగ్గు లింకేజ్ పరిమాణంలో 50 శాతం వరకు బొగ్గును ఎగుమతి చేయవచ్చుబొగ్గు లింకేజ్‌లు కలిగి ఉన్న సంస్థలు ఈ విండో కింద పొందిన బొగ్గును గ్రూప్ కంపెనీలలో అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవచ్చుశుభ్రం చేసిన బొగ్గుకు ఉన్న ప్రస్తుత డిమాండ్‌భవిష్యత్తులో పెరిగే డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే వాషరీ నిర్వహకులకు బొగ్గు లింకేజీలను కేటాయించడం వల్ల దేశంలో శుభ్రం చేసిన బొగ్గు లభ్యత పెరుగుతుందితత్ఫలితంగా దిగుమతులు తగ్గుతాయిశుభ్రం చేసిన బొగ్గుకు విదేశాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున ఎగుమతుల కోసం ఈ బొగ్గును ఉపయోగించొచ్చు.

 

***


(रिलीज़ आईडी: 2203361) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Kannada , Malayalam , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil