ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
11 DEC 2025 10:27AM by PIB Hyderabad
శ్రీ ప్రణబ్ ముఖర్జీ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. శ్రీ ముఖర్జీ ఒక శిఖరాయమాన రాజనీతిజ్ఞుడు. అసాధారణ ప్రజ్ఞావంతుడు. దశాబ్దాల పాటు ప్రజాజీవనంలో అచంచలమైన అంకితభావంతో భారత్‌కు ఆయన సేవలు అందించారని ప్రధానమంత్రి ప్రశంసించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘శ్రీ ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్బంగా ఆయనకు నేను నివాళులు అర్పిస్తున్నాను. శిఖరాయమాన రాజనీతిజ్ఞునిగా, అసాధారణ ప్రజ్ఞావంతునిగా దశాబ్దాల పాటు ప్రజాజీవనంలో అచంచలమైన అంకితభావంతో భారత్‌కు ఆయన సేవలందించారు. ప్రణబ్ బాబు తెలివితేటలు, స్పష్టమైన ఆలోచనలు మన ప్రజాస్వామ్యాన్ని అడుగడుగునా సుసంపన్నం చేశాయి. ఏళ్ల తరబడి ఆయనతో నేను మాటామంతీ జరిపిన క్రమంలో, ఎన్నో విషయాలను ఆయన నుంచి నేర్చుకో గలగడం నాకు దక్కిన భాగ్యం’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2202143)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam