ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ సి. రాజగోపాలాచారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 10 DEC 2025 8:48AM by PIB Hyderabad

ఈ రోజు శ్రీ సి. రాజగోపాలాచారి జయంతి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. ఒక స్వాతంత్య్ర యోధునిగానూ, ఆలోచనాపరునిగానూ, మేధావిగానూ, రాజనీతి కోవిదునిగానూ ఆయనను ప్రధానమంత్రి స్మరించుకున్నారు. 20వ శతాబ్దంలో చురుకైన మేధస్సుగల వ్యక్తుల్లో  ఒకరుగా రాజాజీ మెలిగారు, విలువలను ఏర్పరచాలనీ, ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవాలనీ ఆయన విశ్వసించారు అని ప్రధానమంత్రి అన్నారు.
భారత స్వాతంత్య్ర పోరాటానికీ, ప్రజాజీవనానికీ ఆయన అందించిన సేవలు కలకాలం నిలిచేనని దేశ ప్రజలు కృతజ్ఞత‌ పూర్వకంగా గుర్తుచేసుకుంటున్నారని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘శ్రీ సి. రాజగోపాలాచారి పేరును స్మరించుకోగానే స్వాతంత్య్ర యోధుడు, ఆలోచనపరుడు, మేధావి, రాజనీతికోవిదుడు.. ఈ విశేషణాలు వెనువెంటనే మనకు స్ఫురిస్తాయి. ఆయన జయంతి సందర్భంగా ఆయనకు ఇవే నివాళులు. 20వ శతాబ్దంలో చురుకైన మేధస్సుగల వ్యక్తులలో ఒకరుగా రాజాజీ  నిలుస్తారు, విలువలను ఏర్పరచాలనీ, ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవాలనీ ఆయన విశ్వసించారు. కలకాలం నిలిచే ఆయన సేవలను మన దేశ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.

రాజాజీ జయంతి సందర్భంగా,  ప్రాచీన గ్రంథాలయ దస్తావేజుల్లో నుంచి కొన్ని ఆసక్తిదాయక అంశాలను నేను మీతో పంచుకుంటున్నాను. వీటిలో యవ్వనంలో రాజాజీ చిత్రం, క్యాబినెట్ మంత్రిగా ఆయనను నియమించినప్పటి అధికార ప్రకటన, 1920వ దశాబ్దంలో స్వచ్ఛంద కార్యకర్తలతో కలిసి ఉన్న ఒక చిత్రం, 1922 లో గాంధీ జీ జైలులో ఉండగా రాజాజీ సంపాదకునిగా వ్యవహరించిన యంగ్ ఇండియా సంచిక  ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2201383) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam