సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఫిలిం సర్టిఫికేషన్ కోసం ఏర్పాటు చేసే అన్ని సమీక్షా, పునఃసమీక్షా కమిటీల్లో 50 శాతం మహిళా భాగస్వామ్యం ఉండేలా సీబీఎఫ్‌సీ చర్యలు


సమాచార భద్రతకు, వ్యవస్థ విశ్వసనీయతకు హామీ ఇస్తూనే,

గోప్యతా నియమాలకు అనుగుణంగా క్యూఆర్‌కోడ్‌ ద్వారా అందించే సమాచారంలో మార్పులు:

ధ్రువీకరణకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించడంలో ఎలాంటి ప్రభావం ఉండదు

प्रविष्टि तिथि: 05 DEC 2025 2:47PM by PIB Hyderabad

బోర్డుఅడ్వైజరీ ప్యానెళ్లలో మూడో వంతు మహిళా సభ్యులను తప్పనిసరి చేసిన సినిమాటోగ్రాఫ్ (ధ్రువీకరణనియమాలు-2024 ప్రకారం మహిళా ప్రాతినిధ్యానికి తగిన ప్రాధాన్యం లభించిందిఅలాగేనిబంధనలకు అనుగుణంగా చిత్రాలను సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన సమీక్షా (ఎగ్జామినింగ్కమిటీపునఃసమీక్షా (రివైజింగ్కమిటీల్లో 50 శాతం మహిళలు ఉండేలా సీబీఎఫ్‌సీ చర్యలు తీసుకుంది.

సినిమాటోగ్రాఫ్ చట్టం - 1952లో పేర్కొన్న నియమాలకు అనుగుణంగా బోర్డు సభ్యుల పదవీకాలం నిర్ణయిస్తారుసినిమాటోగ్రాఫ్ (ధ్రువీకరణనియమాలు 2024 – ప్రకారం కేంద్ర ప్రభుత్వ అభీష్టం మేరకు మూడేళ్ల పదవీకాలాన్ని మించకుండా బోర్డు సభ్యులు పనిచేస్తారుఅయితే వారి పదవీకాలం.. నూతన సభ్యుల నియామకం పూర్తయ్యే వరకు కొనసాగుతుంది.

బోర్డు సభ్యులతో సీబీఎఫ్‌సీ ఆన్‌లైన్ సమావేశాలు నిర్వహిస్తుంది. 2017 నుంచీ ఈ-సినీప్రమాణ్ ఆన్‌లైన్ సర్టిఫికేషన్ వేదిక ద్వారా ధ్రువీకరణకు సంబంధించిన ప్రక్రియలు డిజిటల్ రూపంలోకి మారాయిదీని ద్వారా దరఖాస్తుల సమర్పణవిశ్లేషణఆమోదం అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయిదరఖాస్తు చేసుకున్న సినిమాల సంఖ్య ఆధారంగా సకాలంలో ధ్రువీకరణ పూర్తయ్యేలా ఎగ్జామినింగ్రివైజింగ్ కమిటీలు సమావేశాలు నిర్వహిస్తాయి.

సినిమా పేరుభాషవ్యవధిదరఖాస్తుదారుని పేరునిర్మాత పేరుసారాంశంనటీనటులు/నిపుణుల వివరాలు వంటి ధ్రువీకరణకు సంబంధించిన ప్రాథమిక సమాచారం.. క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటుందిడేటా భద్రతకువ్యవస్థ విశ్వసనీయతకు హామీ ఇస్తూగోప్యతా నియమాలకు అనుగుణంగా.. క్యూఆర్‌ కోడ్ రూపంలో ఈ-సినీప్రమాణ్ పోర్టల్లో అందుబాటులో ఉంచే సమాచారంలో మార్పులు జరిగాయిఅయితే సర్టిఫికేషన్‌కు సంబంధించి ప్రజలకు అందించే సమాచారంపై ఈ మార్పులు ఎలాంటి ప్రభావం చూపించవు.

ప్రతి ఏటా వార్షిక నివేదికను కేంద్ర సమాచారప్రసార మంత్రిత్వ శాఖకు సీబీఎఫ్‌సీ సమర్పిస్తుందిఈ సమాచారాన్ని మంత్రిత్వ శాఖకు చెందిన పూర్తి వార్షిక నివేదికలో పొందుపరుస్తారుక్రమం తప్పకుండా ప్రచురించే ఈ నివేదిక మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటుంది.

రాజ్యసభలో శ్రీమతి సాగరికా ఘోష్ అడిగిన ప్రశ్నకు స్పందనగా కేంద్ర సమాచారప్రసారాలుపార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ ఈ సమాచారాన్ని లిఖితపూర్వకంగా అందించారు.

 

***


(रिलीज़ आईडी: 2199672) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali-TR , Assamese , Odia , Tamil , Kannada , Malayalam