ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నావికాదళ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 04 DEC 2025 8:41AM by PIB Hyderabad

ఈ రోజు నేవీ డే సందర్భంగా భారత నావికాదళ సిబ్బంది అందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అసాధారణ ధైర్యానికీ, దృఢ సంకల్పానికీ మన నావికా దళం పర్యాయపదమని శ్రీ మోదీ అన్నారు. మన తీర ప్రాంతాలను రక్షిస్తూ, సముద్రపరంగా మన ప్రయోజనాలను వారు కాపాడుతున్నారు. ‘‘ఈ సంవత్సరం దీపావళిని నేనెన్నటికీ మరచిపోలేను. ఐఎన్ఎస్ విక్రాంత్‌లో నావికాదళ సిబ్బందితో కలిసి నేను పండుగ చేసుకున్నాను. భవిష్యత్తులో భారత నావికా దళం మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘భారత నావికాదళ సిబ్బంది అందరికీ నేవీ డే శుభాకాంక్షలు. అసాధారణమైన ధైర్యసాహసాలకు, దృఢ సంకల్పానికి మన నావికా దళం పర్యాయపదం. వారు తీరప్రాంతాలను రక్షిస్తూ, మన సముద్ర ప్రయోజనాలను కాపాడుతున్నారు. ఇటీవల మన నావికాదళం స్వావలంబన, ఆధునికీకరణపై దృష్టి సారించింది. ఇది మన భద్రతా యంత్రాంగాన్ని మెరుగుపరిచింది.

ఈ ఏడాది దీపావళిని నేనెన్నటికీ మరచిపోలేను. ఐఎన్ఎస్ విక్రాంత్‌లో నావికాదళ సిబ్బందితో కలిసి నేను పండుగ చేసుకున్నాను. మన నావికా దళం భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.’’

 

*** 


(రిలీజ్ ఐడి: 2199168) సందర్శకుల సూచీ సంఖ్య : : 65