సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తప్పుడు వార్తలు ప్రజాస్వామ్యానికి ముప్పు: సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్


· తప్పుడు వార్తలు, ఏఐ ఆధారిత డీప్‌ఫేక్‌లను అరికట్టేలా చట్టపరమైన నిబంధనల బలోపేతానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం

प्रविष्टि तिथि: 03 DEC 2025 2:58PM by PIB Hyderabad

సామాజిక మాధ్యమాలుతప్పుడు వార్తలకు సంబంధించి లేవనెత్తిన అంశం చాలా తీవ్రమైన విషయమని కేంద్ర సమాచారప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ లోకసభకు తెలిపారుతప్పుడు వార్తలు భారత ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమించాయన్న ఆయన.. సామాజిక మాధ్యమ వేదికలుతప్పుడు వార్తలుఏఐ ఆధారిత డీప్ ఫేక్‌లపై కఠిన చర్యలు తీసుకోవడం అత్యావశ్యకమని స్పష్టం చేశారుసామాజిక మాధ్యమాలను ఉపయోగించే విధానం... భారత రాజ్యాంగాన్ని అనుసరించడానికి లేదా పార్లమెంటు రూపొందించిన చట్టాలను పాటించడానికి ఇష్టపడని కొన్ని వ్యవస్థలను సృష్టించిందని ఆయన అభిప్రాయపడ్డారునిశ్చితమైన చర్యలు తీసుకోవాల్సినకఠిన నిబంధనలను రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన తేల్చి చెప్పారు.

 

పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఇటీవల కొత్త నియమాలను ప్రవేశపెట్టామని, 36 గంటల్లోపు తొలగించాలన్న నిబంధన కూడా అందులో ఉందని శ్రీ వైష్ణవ్ తెలిపారుఏఐ ఆధారిత డీప్‌ఫేక్‌లను గుర్తించితగిన చర్యలు తీసుకోవడానికి ముసాయిదా నియమాన్ని కూడా ప్రచురించామనిప్రస్తుతం దీనిపై సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారుపార్లమెంటరీ కమిటీ కృషిని మంత్రి అభినందించారుచట్టపరమైన ఏర్పాట్లను బలోపేతం చేసేందుకు కీలక సిఫార్సులతో కూడిన నివేదికను సమర్పించిన శ్రీ నిశికాంత్ దూబేకుఇతర సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

 

తప్పుడు వార్తలుసామాజిక మాధ్యమాలకు సంబంధించిన విషయాల్లో.. వాక్ స్వాతంత్య్రానికిమన ప్రజాస్వామ్య రక్షణకు మధ్య సునిశిత సమతౌల్యం ఒక అంశంగా ఉందని మంత్రి పేర్కొన్నారుఈ సమతౌల్యం కోసం ప్రభుత్వం పూర్తి జాగరూకతతో కృషి చేస్తోందన్నారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో డిజిటల్ ఇండియా కార్యక్రమం విప్లవాత్మక మార్పులను తెచ్చిందనిసాంకేతికతను అందరికీ అందుబాటులోకి తెచ్చిందని ఆయన వివరించారుదాని సానుకూల ఫలితాలను కూడా తప్పక గుర్తించాలన్నారుసామాజిక మాధ్యమాలు ప్రతి పౌరుడికీ ఓ వేదికను కూడా అందించాయని ఆయన అన్నారుఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. సమాజానికి పునాదిగా నిలిచే సంస్థలనువిశ్వాసాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.

 

***


(रिलीज़ आईडी: 2199165) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Khasi , Urdu , Marathi , हिन्दी , Bengali-TR , Bengali , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam