ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ధన్‌బాద్ ఐఐటీ శతాబ్ది వ్యవస్థాపక వారోత్సవాల సందర్భంగా ప్రసంగించిన ప్రధాని ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.కె. మిశ్రా

ప్రధానమంత్రి వికసిత భారత్- 2047 దార్శనికతను ముందుకు నడపాలని ఐఐటీ ధన్‌బాద్‌కు పిలుపునిచ్చిన డాక్టర్ పి.కె. మిశ్రా

ప్రపంచవ్యాప్త గందరగోళంలోనూ బలంగా భారత ఆర్థిక మూలాలు
అనేక దేశాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల దృష్టిలో భారత్ ఇప్పుడు ‘విశ్వబంధు’...

ఆధునిక సామర్థ్యాన్ని నాగరిజక విజ్ఞానంతో మిళితం చేస్తున్న విశ్వసనీయ భాగస్వామిగా ప్రపంచ దేశాల దృష్టిలో భారత్

భారత కీలక ఖనిజాల వ్యూహానికి ఐఐటీ ధన్‌బాద్ కేంద్రంగా ఉండాలని కోరిన డాక్టర్ పి.కె. మిశ్రా

प्रविष्टि तिथि: 03 DEC 2025 3:08PM by PIB Hyderabad

ధన్బాద్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) శతాబ్ది వ్యవస్థాపక వారోత్సవాల్లో ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.కె. మిశ్రా ఈ రోజు ప్రారంభోపన్యాసం చేశారు. అధ్యాపకులువిద్యార్థులుపూర్వ విద్యార్థులువిశిష్ట అతిథులనుద్దేశించి మాట్లాడుతూ.. 2047 నాటికి వికసిత భారత్‌గా ఎదిగే దిశగా భారత్ ప్రస్థానంలో ఐఐటీ- ధన్‌బాద్ కీలక అత్యంత కీలకమని స్పష్టం చేశారు.

ఈ ఏడాది మొదట్లో ధన్బాద్ ఐఐటీ (ఐఎస్ఎం) డాక్టర్ పి.కె. మిశ్రాకు డాక్టర్ ఆఫ్ సైన్స్’ను అందించింది.

మైనింగ్, ఇంధనంభౌగోళిక విజ్ఞాన శాస్త్రాలు, అప్లైడ్ ఇంజనీరింగుల్లో సంస్థ విశేష సహకారాన్ని అందించిందన్న డాక్టర్ మిశ్రా.. ఈ వందేళ్ల వేడుకలో పాల్గొనడం సంతోషాన్నిస్తోందన్నారు. ఐఐటీ ధన్‌బాద్ మైనింగ్ విద్యలో ఆసియాలో అగ్రగామిగా ఉందని తెలిపారు. కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, జీఎస్ఐ, సీఎంపీడీఐ, ఎన్టీపీసీ వంటి జాతీయ సంస్థలకు ఎప్పటికప్పుడు నిపుణులను అందించిందని గుర్తు చేశారు. గనుల భద్రత, బొగ్గు అన్వేషణ, చమురు - వాయువు, ఖనిజ శుద్ధి అంశాల్లో దాని పరిశోధన ఫలితాలు జాతీయ స్థాయి ప్రమాణాలను నెలకొల్పాయని ఆయన అన్నారు. శతాబ్ది ఉత్సవం ఓ మైలురాయి మాత్రమే కాదు. సానుకూల సామాజిక ఫలితాల కోసం.. ప్రజలందరి ఆస్తిగా జ్ఞానాన్ని వినియోగిస్తే, ఆ తిరుగులేని నిబద్ధత ఎంతటి సత్ఫలితాలనిస్తుందో ఇది చాటుతోంది” అని డాక్టర్ మిశ్రా వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న భారత దీర్ఘకాలిక లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సంస్థ కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు.

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదగాలన్న ప్రధానమంత్రి లక్ష్యాన్ని వివరిస్తూ... ప్రకృతి, సంస్కృతి మధ్య సమతౌల్యాన్ని కొనసాగిస్తూ, విజ్ఞాన శాస్త్రాలు- సాంకేతికతల్లో అంతర్జాతీయంగా అగ్రగామిగా ఉంటూ అభివృద్ధి చెందిన దేశం హోదా సాధించడమే లక్ష్యమని శ్రీ మిశ్రా అన్నారు. భారత్ అన్ని రంగాల్లో ఆత్మ నిర్భరత సాధిస్తుందని, అభివృద్ధికి మహిళలు నేతృత్వం వహిస్తారని, ఆర్థిక వ్యవస్థ సమ్మిళితంగానూ వినూత్నంగానూ ఉంటుందని, జాతి జీవనంలో అవినీతి, కులతత్వం, మతతత్వాలకు స్థానం ఉండబోదని ఆయన పునరుద్ఘాటించారు.

గత పదకొండేళ్లలో భారతదేశ ఆర్థిక గమనం గురించి ప్రస్తావిస్తూ.. మన ప్రధానమంత్రి విధానానికి ఆవిష్కరణ, పునరావిష్కరణలే ముఖ్య ఆధారాలుగా ఉన్నాయని ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి వివరించారు. ఈ విధానానికి సంబంధించి నాలుగు ముఖ్య ప్రాతిపదికలను ఆయన వివరించారు. అవి: పోటీతత్వాన్ని ప్రోత్సహించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడం, ఫలితాలు క్షేత్ర స్థాయికి చేరేలా భరోసా ఇవ్వడం. ఆరోగ్య విపత్తువాణిజ్య యుద్ధాలుభౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలువాతావరణ మార్పుసరఫరా వ్యవస్థలో అంతరాయాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గందరగోళం ఏర్పడిన విషయాన్ని ఆయన అంగీకరించారు. అయినప్పటికీ భారత్ వాటిని ఎదుర్కొని నిలిచిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన 8.2 శాతం జీడీపీ వృద్ధిని ఉదాహరించారు. “అనిశ్చితుల మధ్య కూడా.. ఈ అమృత కాలంలో ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో భారత్ ముందుకు సాగుతోంది” అని ఆయన అన్నారు.

భవితను తీర్చిదిద్దడంలో సాంకేతికత విప్లవాత్మక పాత్ర పోషిస్తుందని డాక్టర్ మిశ్రా స్పష్టం చేశారు. స్మార్ట్ ఫోన్లు, బిగ్ డేటా నుంచి రోబోటిక్స్, కృత్రిమ మేధ వరకు.. అన్ని చోట్లా అంతరాయాలున్నాయని ఆయన పేర్కొన్నారు. వందకు పైగా యునికార్న్లురెండు లక్షలకు పైగా అంకుర సంస్థలతో భారత్ అంతర్జాతీయ సృజన కేంద్రంగా ఉందని ఆయన అన్నారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థగా భారత్ నిలిచిందన్నారు. ప్రాథమిక పరిశోధన- ప్రొటోటైపుల కోసం రూ. లక్ష కోట్ల అనుసంధాన్ జాతీయ పరిశోధన నిధి, కృత్రిమ మేధలో నేతృత్వాన్ని బలోపేతం చేయడం కోసం ఇండియా ఏఐ మిషన్, పరివర్తనాత్మక అంకుర సంస్థలకు చేయూతనిచ్చేలా ప్రత్యేక డీప్ టెక్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ సహా.. ఆవిష్కరణల్లో అంతరాలను తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు. భవిష్యత్ సన్నద్ధ ఆవిష్కరణ వ్యవస్థల రూపకల్పన దిశగా కీలకమైన ప్రారంభ చర్యలివి అన్నారు.

ప్రధానమంత్రి మంత్రప్రదంగా భావించే ‘4ఎస్‌’లను వివరించారు – స్కోప్స్కేల్స్పీడ్స్కిల్. పాలనకు వీటిని మార్గదర్శక సూత్రాలుగా ఆయన భావిస్తున్నారన్నారు. ఆయుష్మాన్ భారత్డిజిటల్ ఇండియాయూపీఐమిషన్ కర్మయోగి వంటి కీలక పథకాలను ఉదాహరిస్తూ... సాంకేతికత - విలువలు సమ్మిళితమై, ప్రజలే కేంద్రంగా సేవలందించేందుకు ఎలా తోడ్పడుతున్నాయో డాక్టర్ మిశ్రా వివరించారు. ఆధార్కోవిన్నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ వంటి వేదికలు.. సమ్మిళితత్వమూ, సమర్థతా మధ్య సమన్వయం సాధ్యమే అని నిరూపించాయన్నారు. చాలా దేశాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు నేడు భారత్‌ను విశ్వబంధుగా చూస్తున్నాయి. నాగరిక విజ్ఞానాన్ని ఆధునిక సామర్థ్యంతో మేళవిస్తున్న విశ్వసనీయ భాగస్వామిగా నేడు భారత్‌ను ఆ దేశాలు పరిగణిస్తున్నాయి అని డాక్టర్ మిశ్రా అన్నారు. నేషనల్ క్వాంటం మిషన్ వంటి అత్యాధునిక రంగాలు, చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్వంటి అంతరిక్ష విజయాలుజాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌తోపాటు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 200 గిగావాట్లను దాటడం, శాస్త్రీయ అన్వేషణ కోసం దేశీయంగా సబ్‌మెర్సిబుల్‌లను అభివృద్ధి చేస్తున్న డీప్ ఓషన్ మిషన్లలో సాధించిన పురోగతిని కూడా ఆయన ప్రస్తావించారు.

ఈ నేపథ్యంలో ఐఐటీ ధన్‌బాద్‌పై ప్రత్యేక బాధ్యత ఉందని శ్రీ మిశ్రా స్పష్టం చేశారు. ఆధునిక ప్రయోగశాలలుసూపర్ కంప్యూటింగ్ క్లస్టర్‌లుభూకంప పరిశీలన కేంద్రాలువిస్తరిస్తున్న ఇంక్యుబేషన్ వ్యవస్థ వంటి సదుపాయాలతో... దేశ ప్రాధాన్యాలకు అనుగుణంగా సేవలందించేందుకు ఈ సంస్థ సన్నద్ధంగా ఉందన్నారు. జాతీయ కీలక ఖనిజాల మిషన్ కింద ఈ సంస్థకు లభించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హోదా.. సంబంధిత వ్యూహాన్ని రూపొందించడంలో దాని సామర్థ్యంపై దేశానికి ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. ప్రజా ప్రయోజనాలనే పరిశోధనలకు కేంద్రంగా చేస్తూ... వాతావరణం, ఖనిజాలు, ఇంధన పరివర్తన, మెటీరియల్స్, అధునాతన తయారీపై దృష్టి పెట్టాలని సంస్థను ఆయన కోరారు. సాంకేతిక నైపుణ్యం తప్పనిసరి. కానీ తగినంతగా లేదు. వైఖరి, సమష్టి కృషి, నమ్రత, నైతికత కూడా అంతే ముఖ్యమైనవి అని విద్యార్థులకు ఆయన సూచించారు. జాతీయ లక్ష్యాల సాధన కోసం సమష్టి కృషి, పారదర్శకత, గౌరవం అత్యావశ్యకమని ఆయన స్పష్టం చేశారు.

భారత్‌కు స్పష్టమైన దీర్ఘకాలిక దిశానిర్దేశం, దానిని కొనసాగించగల నిర్మాణ వ్యవస్థ ఉన్న సమయంలో.. ఐఐటీ ధన్‌బాద్ రెండో శతాబ్దంలోకి అడుగుపెడుతోందని చెప్తూ, డాక్టర్ మిశ్రా తన ప్రసంగాన్ని ముగించారు. “సంస్థాగత బలాలు, వికసిత భారత్2047 జాతీయ లక్ష్యాల మధ్య సమన్వయం స్పష్టంగా కనిపిస్తోంది. విజ్ఞానం, సాంకేతికత, మానవ మూలధనాన్ని సద్వినియోగం చేసుకుని.. మరింత సమర్థమైన, గర్వించదగిన, సమానావకాశాలున్న దేశంగా భారత్ ఎదిగే విధానాన్ని రాబోయే 25 ఏళ్లు నిర్దేశిస్తాయి అని ఆయన అన్నారు. సభనుద్దేశించి ప్రసంగించే అవకాశాన్నిచ్చిన డైరెక్టర్ప్రొఫెసర్ సుకుమార్ మిశ్రానిర్వాహక బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలంటూ అధ్యాపకులు, విద్యార్థులుపూర్వ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

 

***


(रिलीज़ आईडी: 2198497) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam