ప్రధాన మంత్రి కార్యాలయం
మహిళల అంధుల టీట్వంటీ ప్రపంచ కప్ విజేతలతో ముచ్చటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
సవాళ్లను అధిగమించి, ఆత్మవిశ్వాసంతో.. ప్రతిభను, జాతి గౌరవాన్ని ప్రదర్శించిన క్రీడాకారిణులను ప్రశంసించిన ప్రధాని
కష్టపడే తత్వం క్రీడా మైదానంలోనే కాకుండా జీవితంలోనూ విజయాన్ని అందిస్తుంది: పీఎం
జట్టు సాధించిన విజయం అందరికీ స్ఫూర్తిదాయకం, ఇది భారత యువ శక్తిని, స్థైర్యాన్ని తెలియజేస్తుంది: పీఎం
प्रविष्टि तिथि:
28 NOV 2025 11:18AM by PIB Hyderabad
మహిళల అంధుల టీట్వంటీ ప్రపంచ కప్‌లో విజయం సాధించిన భారత జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలోని లోక కల్యాణ్ మార్గ్, 7లో సంభాషించారు. క్రీడాకారిణులతో ఆత్మీయంగా ముచ్చటించిన శ్రీ మోదీ.. వారి దృఢ సంకల్పాన్ని ప్రశంసించారు. ఆత్మవిశ్వాసంతో, సవాళ్లను ఎదుర్కొనే తత్వంతో ప్రయాణం కొనసాగించమని వారిని ప్రోత్సహించారు. క్రీడా మైదానంలోనే కాకుండా జీవితంలోనూ కష్టపడి పని చేసేవారు ఎప్పుడూ విఫలం కారన్నారు. క్రీడాకారిణులు తమదైన ప్రత్యేక గుర్తింపును రూపొందించుకున్నారని, అది వారి ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేసిందన్నారు.
150 ఏళ్లు పూర్తి చేసుకున్న వందేమాతరం గురించి వివరిస్తూ.. ఐక్యతా విలువలు, జాతీయ గౌరవాన్ని ఈ బృంద స్ఫూర్తి ప్రతిబింబిస్తుందని శ్రీ మోదీ అన్నారు. కాశీతో తన అనుబంధాన్ని గుర్తు చేసేలా.. భక్తి గీతాలు పాడిన ఓ క్రీడాకారిణి సంగీత ప్రతిభను ఆయన మెచ్చుకున్నారు.
రాజకీయాలతో ఈ బృందానికున్న బహుముఖ ప్రజ్ఞను ప్రధానమంత్రి పోల్చి చూశారు. రాజకీయాల్లో ఉన్నవారు మంత్రిగా, ఎంఎల్ఏగా, ఎంపీగా వేర్వేరు పాత్రలను ఎలా పోషిస్తారో క్రీడాకారులు సైతం అలాంటి ఆల్ రౌండర్లే అని అన్నారు.
సామాజిక వివక్ష, కుటుంబ ఇబ్బందులతో సహా తమకెదురైన సవాళ్లను అధిగమించిన విధానాన్ని క్రీడాకారిణులు పంచుకున్నారు. తాను విజయం సాధించడమే మరణించిన తన తండ్రి కల అన్న ఓ క్రీడాకారిణి.. ప్రధానమంత్రిని కలుసుకోవడంతో అది సాకారమైందన్నారు.
ఈ బృందం సాధించిన విజయం దివ్యాంగులకు మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. వారు సాధించిన విజయాలు భారత యువ శక్తిని, సవాళ్లను ఎదుర్కొనే తత్వాన్ని ప్రదర్శిస్తాయని అన్నారు. పిల్లల్లో నిండిన ఇలాంటి ధైర్యం, దృఢ సంకల్పంతో దేశం ముందుకు సాగుతోందని గర్వం వ్యక్తం చేశారు.
***
(रिलीज़ आईडी: 2196720)
आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam