భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ)లో విలేకరుల సమావేశం నిర్వహించిన అంతర్జాతీయ పోటీ చిత్రాల ఎంపిక జ్యూరీ
అంతర్జాతీయ పోటీ చిత్రాల సహజత్వాన్ని, వైవిధ్యాన్ని ప్రశంసించిన జ్యూరీ ప్రపంచ సమస్యలను ప్రముఖంగా చూపిన కథల్లో పిల్లలదే ప్రధానపాత్ర
గోవాలో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫఐ)లో ఈ రోజు అంతర్జాతీయ పోటీ చిత్ర్రల జ్యూరీ విలేకరుల సమావేశం నిర్వహించింది. దీనికి ప్రపంచ సినిమా రంగానికి చెందిన గౌరవ సభ్యులు హాజరయ్యారు. ఈ సంవత్సరం పోటీలో 15 చిత్రాలు ఉన్నాయి. వాటిలో మూడు భారతీయ చిత్రాలు ఉన్నాయి. సుప్రసిద్ధ దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా అధ్యక్షుడుగా ఉన్న ఈ జ్యూరీలో అమెరికాకు చెందిన ఎడిటర్, డైరెక్టర్ గ్రేమ్ క్లిఫోర్డ్, జర్మన్ నటి కథరినా షుట్లర్, శ్రీలంక దర్శకుడు చంద్రన్ రుత్నం, సినీమాటోగ్రాఫర్ రెమి అడెఫరాసిన్ సభ్యులుగా ఉన్నారు.
వైవిధ్యాన్ని, పిల్లల ప్రాధాన్య కథలను ప్రశంసించిన జ్యూరీ
చిత్రోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న ఐఎఫ్ ఎఫ్ఐ అధికారులకు జ్యూరీ అధ్యక్షుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. ఉన్నత స్థాయి ప్రమాణాలు కలిగిన అంతర్జాతీయ జ్యూరీకి అధ్యక్షునిగా నేర్చుకునే అవకాశం లభించడాన్ని ప్రముఖంగా పేర్కొన్నారు. పోటీలోని చిత్రాల గురించి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన చిత్రాలలో సహజత్వం, వైవిధ్యం గురించి మాట్లాడుతూ, ప్రతి సినిమా దృశ్య, కథన శైలి ప్రత్యేకతను వివరించారు.
సినిమా అనేది జీవితాన్ని ప్రతిబింబిస్తుందని, ప్రత్యేకించి కథనాలలో పిల్లలను ప్రధాన పాత్రలుగా, రాయబారులుగా చూపడాన్ని రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా ప్రముఖంగా ప్రస్తావించారు. సినిమాలో కృత్రిమ మేధ (ఏఐ) గురించి మాట్లాడుతూ, భవిష్యత్తులో సాంకేతికత జ్యూరీ కార్యాచరణను ప్రభావితం చేయవచ్చని, అయినప్పటికీ, సినిమా నిర్మాణానికి అత్యంత ముఖ్యమైన మానవ భావోద్వేగాలను ఏఐ ప్రతిబింబించలేదని ఆయన పేర్కొన్నారు.
చిత్రోత్సవ ప్రారంభ పరేడ్‌ను, చిత్రాల వైవిధ్యాన్ని జ్యూరీ సభ్యుడు గ్రేమ్ క్లిఫోర్డ్ ప్రశంసించారు. చాలా పోటీ సినిమాలు పెద్ద ఓటీటీ వేదికల నుంచి కాకుండా స్వతంత్ర దర్శకుల నుంచి వచ్చాయని ఆయన చెప్పారు. సినిమా భవిష్యత్తుకు సహజత్వం ఎంత ముఖ్యమో ఆయన స్పష్టం చేశారు. అలాగే ప్రపంచ సామాజిక సవాళ్లను ప్రతిబింబిస్తూ పిల్లల సమస్యలను పరిష్కరించే అనేక చిత్రాలను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
మరో సభ్యుడు కథరినా షుట్లర్ జ్యూరీలో భాగమైనందుకు తన కృతజ్ఞతను వ్యక్తం చేశారు. ప్రదర్శించిన చిత్రాల వైవిధ్యాన్ని, దర్శకులకు ఫెస్టివల్ అందించిన మద్దతును ప్రశంసించారు. చిత్రనిర్మాణంలోని సాంకేతిక, కళాత్మక అంశాలు రెండింటిపైనా చిత్రోత్సవ శిక్షణ తరగతులు విలువైన ఆలోచనలను అందించాయని అభినందించారు.
జ్యూరీకి సవాలుగా మారిన ఉత్తమ చిత్రాల ఎంపిక
ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసిన ప్రక్రియ చాలా సంతృప్తికరంగా ఉందని జ్యూరీ సభ్యుడు చంద్రన్ రుత్నం తెలిపారు. చర్చలు కొన్నిసార్లు ఏకాభిప్రాయం కుదరని స్థాయికి చేరుకున్నప్పటికీ, జ్యూరీ చివరికి న్యాయమైన పరిగణించదగిన నిర్ణయాలకు చేరుకుందని ఆయన తెలిపారు.
మరో సభ్యుడు రెమి అడెఫరాసిన్ ఈ ఫెస్టివల్‌ను ఒక అద్భుతంగా అభివర్ణించారు. ప్రతి పోటీ చిత్రం దేనికదే తనదైన ప్రత్యేకత కలిగి ఉండటం వల్ల వాటిలో ఒక్క అత్యుత్తమ చిత్రాన్ని ఎంపిక చేయడం కష్టమైన సవాలు గానే నిలిచిందని అంగీకరించారు. భవిష్యత్తులో భారతదేశంలో ఒక సినిమాను చిత్రీకరించాలనే తన కోరికను ఆయన వ్యక్తం చేశారు.
చిత్రనిర్మాణంలో లింగ సమానత్వం
సినిమాలో మహిళల ప్రాతినిధ్యం విషయంలో గత 4-5 దశాబ్దాలుగా మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని గుర్తించినట్టు జ్యూరీ తెలిపింది. అయినప్పటికీ, చిత్రాలను మూల్యాంకనం చేసేటప్పుడు, లింగపరంగా కంటే విషయం పైనే దర్శకుని దృష్టి ఉంటుందని వారు చెప్పారు. సామాజిక సమస్యల పట్ల కథనంలో పురుషులు, మహిళలు సమాన సున్నితత్వంతో వ్యవహరిస్తారని వారు అంగీకరించారు.
విలేకరుల సమావేశం ముగింపులో జ్యూరీ సభ్యులందరూ అసాధారణమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఫెస్టివల్ నిర్వాహకులకు తమ ప్రశంసలను తెలియజేశారు. ఐఎఫ్ఎఫ్ఐ మరింత అభివృద్ధి చెందుతూ ప్రపంచవ్యాప్త గుర్తింపును సాధించాలని వారు ఆకాంక్షించారు.
Press Conference link
ఇఫీ గురించి
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ), దక్షిణ ఆసియాలోనే అత్యంత పురాతనమైన, అతిపెద్ద సినిమా ఉత్సవంగా పేరు గాంచింది. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ), గోవా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ (ఈఎస్జీ) సంయుక్తంగా దీనిని నిర్వహిస్తున్నాయి. పునరుద్ధరించిన పాత సినీ కళాఖండాలు, ఆధునిక ప్రయోగ చిత్రాల ప్రదర్శనతో దిగ్గజ దర్శకులు, మొదటిసారి చిత్రాలు తీసిన కొత్త, సాహసోపేత దర్శకులు ఒకే వేదికను పంచుకునే ఈ ఉత్సవం, అంతర్జాతీయ సినీశక్తి కేంద్రంగా ఎదిగింది. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, నివాళులు ఆలోచనలు, ఒప్పందాలు, భాగస్వామ్యాలు, అత్యంత ఉత్సాహభరితమైన 'వేవ్స్ ఫిల్మ్ బజార్' వంటి వైవిధ్యభరిత అంశాల కలయిక ఇఫీని ప్రకాశవంతంగా మార్చాయి. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవా సుందర తీరప్రాంత నేపథ్యంలో జరిగే 56వ ఎడిషన్ భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుతమైన వైవిధ్యాన్ని హామీ ఇస్తోంది. ఇది ప్రపంచ వేదికపై భారతదేశ సృజనాత్మక ప్రతిభను సమగ్రంగా ప్రదర్శించే వేడుక.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2191742
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2190381
IFFI Website: https://www.iffigoa.org/
PIB’s IFFI Microsite: https://www.pib.gov.in/iffi/56new/
PIB IFFIWood Broadcast Channel: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
X Handles: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
* * *
रिलीज़ आईडी:
2195673
| Visitor Counter:
9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
Konkani
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam