ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిసిన రష్యా అధ్యక్షుడి సహాయకుడు


కనెక్టివిటీ, నౌకా నిర్మాణం, బ్లూ ఎకానమీలో సహకార బలోపేతంపై అభిప్రాయాలు పంచుకున్న నేతలు

వచ్చే నెలలో భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఎదురుచూస్తున్నామన్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 18 NOV 2025 9:05PM by PIB Hyderabad

రష్యా అధ్యక్షుడి సహాయకుడు... రష్యన్ ఫెడరేషన్ మారిటైమ్ బోర్డు ఛైర్మన్ శ్రీ నికోలాయ్ పాత్రుషేవ్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

సముద్ర రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం, కనెక్టివిటీ, నైపుణ్యాభివృద్ధి, నౌకానిర్మాణం, బ్లూ ఎకానమీలో సహకారానికి గల కొత్త అవకాశాలు వంటి అంశాలపై వారు అభిప్రాయాలను పంచుకున్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధానమంత్రి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వచ్చే నెలలో భారత్‌లో ఆయనకు ఆతిథ్యం ఇవ్వడానికి ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

 

***


(रिलीज़ आईडी: 2191481) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam