ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ ఎల్.కె. అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
08 NOV 2025 8:16PM by PIB Hyderabad
శ్రీ ఎల్.కె. అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు ఆయన నివాసానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి శ్రీ ఎల్.కె. అద్వానీ విశిష్టమైన సేవలు అందించారని, అవి మనందరికీ గొప్ప స్ఫూర్తినిస్తాయని శ్రీ మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
“శ్రీ ఎల్.కె. అద్వానీ జన్మదిన సందర్భంగా, ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశాను. ఆయన దేశ సేవ అత్యంత విశిష్టమైనది. అది మనందరికీ గొప్ప ప్రేరణను ఇస్తుంది” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2188163)
సందర్శకుల సూచీ సంఖ్య : : 21
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam