ప్రధాన మంత్రి కార్యాలయం
ఆగ్నేయాసియా సహజ ముఖద్వారంగా ఈశాన్య ప్రాంతం: ఓ వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
09 NOV 2025 11:16AM by PIB Hyderabad
కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. దేశంలోని ఈశాన్య ప్రాంతం... ఆగ్నేయాసియా సహజ ముఖద్వారంగా మారుతున్న తీరును ఇది వివరిస్తుంది. "ఈశాన్యాన్ని 'అష్టలక్ష్మి'గా వర్ణిస్తూ ఆగ్నేయాసియాకు ఏ విధంగా భారతదేశ సహజ ముఖద్వారంగా మారుతున్నదీ మంత్రి వివరించారు. ఈశాన్యం కేవలం భారతదేశంలోని ఒక సరిహద్దు ప్రాంతం కాదు. ఇప్పుడది దేశాభివృద్ధికి భావి ముఖచిత్రం" అని ప్రధాని వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా చేసిన ఒక పోస్ట్‌పై ప్రధాని ఈ విధంగా స్పందించారు:
"ఈ సవివరణ వ్యాసంలో కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా ఈశాన్య భారతదేశాన్ని సందర్శించిన అనుభవాన్ని పంచుకుంటూ.. దాని అందాన్ని, అక్కడి ప్రజల అచంచలమైన స్ఫూర్తిని వివరించారు.
ఈశాన్యాన్ని 'అష్టలక్ష్మి'గా వర్ణిస్తూ ఆగ్నేయాసియాకు అది ఏ విధంగా సహజ ముఖద్వారంగా మారుతుందో మంత్రి వివరించారు. ఈశాన్యం కేవలం భారత్ సరిహద్దు ప్రాంతం మాత్రమే కాదు.. ఇప్పుడది దేశాభివృద్ధికి భావి ముఖచిత్రంగా నిలుస్తోంది"
***
(Release ID: 2188158)
Visitor Counter : 3