సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఐఎఫ్ఎఫ్ఐ 2025 మీడియా అక్రిడిటేషన్: నవంబర్ 10 వరకు పెరిగిన దరఖాస్తు గడువు
Posted On:
05 NOV 2025 5:41PM by PIB Hyderabad
56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి (ఐఎఫ్ఎఫ్ఐ) సంబంధించిన మీడియా అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు గడువును 2025 నవంబర్ 10వ తేదీ వరకు పొడిగించారు. దీనితో ఈ విషయంలో పాత్రికేయులకు ఇప్పుడు అదనపు సమయం లభించింది.
దరఖాస్తు ఈ లింక్‌లో అందుబాటులో ఉంటుంది:
https://accreditation.pib.gov.in/eventregistration/login.aspx
గుర్తింపు పొందిన మీడియా ప్రతినిధులు సినిమా ప్రదర్శనలు, మాస్టర్ క్లాసులు, ప్యానెల్ చర్చలు, పాత్రికేయ సమావేశాలు వంటి ప్రత్యేకమైన కార్యక్రమాలకు హాజరుకావచ్చు. ఈ కార్యక్రమం 2025 నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలోని పనాజీలో జరగనుంది.
పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) సహకారంతో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ).. నవంబర్ 18న పనాజీలో గుర్తింపు పొందిన జర్నలిస్టుల కోసం ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్సును నిర్వహిస్తుంది. 'మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత' పద్ధతిలో గుర్తింపు పొందిన మీడియా ప్రతినిధులు ఈ కోర్సులో పాల్గొనవచ్చు.
ఇప్పటికే ఎఫ్‌టీటీఐ 2025 మీడియా అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న పాత్రికేయలకు సంబంధిత సమాచారం త్వరలో అందుతుంది. పాత్రికేయలు సహాయం కోసం పీఐబీ ఐఎఫ్ఎఫ్ఐ మీడియా సపోర్ట్ డెస్క్‌ను ఈ మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు:
iffi.mediadesk@pib.gov.in
ఐఎఫ్ఎఫ్ఐ అనేది ఆసియాలోనే ఒక ప్రధానమైన సినిమా వేడుక. ఇది ప్రతి సంవత్సరం గోవాలో వేలాది మంది చలన చిత్ర నిపుణులు, సినీ ప్రేమికులను ఒక వేదికపైకి తీసుకొస్తుంది. పొడగించిన గడువుకు ముందుగానే దరఖాస్తులను సమర్పించాలని పాత్రికేయులకు సూచించారు.
***
(Release ID: 2186777)
Visitor Counter : 8