ప్రధాన మంత్రి కార్యాలయం
స్వస్త్ నారీ- సశక్త్ పరివార్ అభియాన్ ద్వారా మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సృష్టించడం పట్ల ప్రధానమంత్రి హర్షం
Posted On:
01 NOV 2025 2:16PM by PIB Hyderabad
స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్ ద్వారా మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్ సాధించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఈ విజయం గురించి ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ చేసిన పోస్టుకు ప్రధానమంత్రి స్పందిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు చాలా ప్రశంసనీయమన్నారు. ఈ రకమైన సామూహిక ఉద్యమాలు మహిళా సాధికారత ప్రయత్నాలకు మరింత ఊతమిస్తాయనీ, నారీ శక్తి జీవితాలపై పరివర్తనాత్మక ప్రభావాన్ని చూపుతాయని ఆయన పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
"ఇది చాలా ప్రశంసనీయం! ఇటువంటి సామూహిక ఉద్యమాలు మా మహిళా సాధికార ప్రయత్నాలకు ఊతమిస్తాయి... మన నారీ శక్తి జీవితాలపై పరివర్తనాత్మక ప్రభావాన్ని చూపుతాయి."
***
(Release ID: 2185520)
Visitor Counter : 6
Read this release in:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam