ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశంలోని ప్రజలను కలిపే ఓ ప్రజా ఉద్యమం ద్వారా నిర్మించిన ‘ఐక్యతా విగ్రహం’.. సర్దార్ పటేల్‌కు ఘన నివాళి: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 31 OCT 2025 12:43PM by PIB Hyderabad

‘ఐక్యతా విగ్రహం’ (‘స్ట్యాచ్యూ ఆఫ్ యూనిటీ) సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళిగా నిర్మించిన స్మారక చిహ్నం. ఇది ప్రజా ఉద్యమానికి అద్భుతమైన ఉదాహరణ. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ముఖ్యంగా గ్రామాల ప్రజలు ఈ ప్రతిష్ఠాత్మక విగ్రహంతో లోతైన అనుబంధాన్ని కలిగి ఉన్నారు.

మోదీ ఆర్కైవ్ ఎక్స్ ఖాతాలో వచ్చిన వరుస పోస్టులకు ప్రతిస్పందిస్తూ ప్రధాని శ్రీ మోదీ ఇలా అన్నారు.

‘‘ఐక్యతా విగ్రహం’ సర్దార్ పటేల్‌కు అంకితం చేసిన ఘన నివాళి. మహత్తర ప్రజా ఉద్యమం ఫలితంగా నిర్మించిన ఈ విగ్రహంతో దేశవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రజలు అనుబంధాన్ని కలిగి ఉన్నారు.

కెవాడియాను సందర్శించండి… దాని వైభవాన్ని స్వయంగా అనుభూతి చెందండి...’’


(रिलीज़ आईडी: 2184576) आगंतुक पटल : 29
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam