ప్రధాన మంత్రి కార్యాలయం
థాయిలాండ్ మహారాణి సిరికిట్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
26 OCT 2025 3:39PM by PIB Hyderabad
థాయిలాండ్ మహారాణి సిరికిట్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారని, ఆమె ఇచ్చిన ఘన వారసత్వం ప్రపంచవ్యాప్తంగా తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
"థాయిలాండ్ మహారాణి సిరికిట్ మరణం నాకు చాలా బాధ కలిగించింది. ఆమె తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేయడం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఈ విచార సమయంలో థాయిలాండ్ మహారాజు, రాజకుటుంబ సభ్యులు, ప్రజలకు సంతాపం తెలియజేస్తున్నాను."
(Release ID: 2182735)
Visitor Counter : 3