రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం:

జాతీయ పోలీసు అమరవీరుల స్మారకం వద్ద రక్షణ మంత్రి పుష్పాంజలి

అమరులైన పోలీసు, పారామిలటరీ సిబ్బందికి, దేశానికి వారు చేసిన సేవలకు ఘన నివాళి

Posted On: 21 OCT 2025 12:02PM by PIB Hyderabad

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా 2025, అక్టోబర్ 21న జాతీయ పోలీసు అమరవీరుల స్మారకం వద్ద రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పుష్పాంజలి ఘటించారు. 1959లో ఇదే రోజున లదాఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద భారీగా ఆయుధాలు ధరించిన చైనీస్ బలగాలు చేసిన మెరుపు దాడిలో 10 మంది పోలీసు వీరులు ప్రాణాలు కోల్పోయారు.

ప్రాణాలర్పించిన యోధులకు రక్షణ మంత్రి ఘన నివాళులు అర్పిస్తూ, దేశానికి సేవలందిస్తున్న పోలీసులుపారామిలటరీ బలగాలకు కృతజ్ఞతలు తెలిపారుసాయుధపోలీసు బలగాలు జాతీయ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారుఒకరు దేశాన్నిదాని ప్రాదేశిక సమగ్రతను పరిరక్షిస్తుంటే, మరొకరు సమాజాన్నిసామాజిక సమగ్రతను కాపాడతున్నారన్నారు. ‘‘సైన్యంపోలీలు వేర్వేరు వేదికల్లో పనిచేస్తున్నప్పటకీ.. వారి లక్ష్యం ఒక్కటే అదే దేశాన్ని రక్షించడంమనం 2047 నాటికి వికసిత్ భారత్‌ను సాధించే దిశగా ముందడుగు వేస్తున్న ఈ సమయంలో దేశం బాహ్యఅంతర్గత భద్రతను సమతూకం చేయడం గతంలో కంటే చాలా ముఖ్యం’’ అని ఆయన చెప్పారు.

ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్ల గురించి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. సరిహద్దుల్లో అస్థిరత ఉన్నప్పటికీ సమాజంలో కొత్త తరహా నేరాలుఉగ్రవాదంసైద్ధాంతిక యుద్ధాలు పుట్టుకొస్తున్నాయన్నారునేరాలు మరింత వ్యవస్థీకృతంగాకంటికి కనిపించని రూపంలోసంక్లిష్టంగా మారుతున్నాయనిసమాజంలో అలజడిని సృష్టించడంవిశ్వాసాన్ని దెబ్బ తీయడందేశ స్థిరత్వానికి సవాలు విసరడమే వాటి లక్ష్యమని తెలియజేశారు.

సమాజంలో నమ్మకాన్ని కొనసాగించే నైతిక బాధ్యతను నిర్వర్తిస్తూనే.. నేరాలను నియంత్రించే అధికారిక బాధ్యతలను పోలీసులు చేపడుతున్నారని రక్షణ మంత్రి ప్రశంసించారు. ‘‘ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే దానికి కారణం.. నిరంతరం అప్రమత్తంగా ఉండే సాయుధ బలగాలుపోలీసులపై వారికున్న నమ్మకమేఈ విశ్వాసమే మన దేశ స్థిరత్వానికి పునాది’’ అని ఆయన అన్నారు.

దీర్ఘ కాలంగా దేశ అంతర్గత భద్రతలో ప్రధాన సవాలుగా నిలిచిన నక్సలిజం గురించి చర్చిస్తూ.. పోలీసుసీఆర్‌పీఎఫ్బీఎస్ఎఫ్స్థానిక అధికారుల సమష్టివ్యవస్థీకృత చర్యలు సమస్య తీవ్రత పెరగకుండా చూశాయనివామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకునేలా చేశాయని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారువచ్చే ఏడాది మార్చి నాటికి ఈ సమస్య పూర్తిగా సమసిపోతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘ఈ ఏడాది అనేక మంది నక్సలైట్లను అంతం చేశాంఒకప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టినవారు ఇప్పుడు లొంగిపోయి అభివృద్ధిని కోరుకుంటూ తీవ్రవాదాన్ని వదలిపెడుతున్నారని చెప్పారుతీవ్రవాద ప్రభావిత జిల్లాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందిఒకప్పుడు నక్సలైట్ కేంద్రాలుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు విద్యా కేంద్రాలుగా మారుతున్నాయిఒకప్పుడు నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు ప్రగతికి కారిడార్లుగా మారుతున్నాయిమన పోలీసుభద్రతా దళాలు ఈ విజయంలో తమదైన పాత్రను పోషించాయి’’ అని అన్నారు.

జాతీయ భద్రతను అందించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ నిబద్ధతనుదీని సాధించడంలో పోలీసు బలగాలు చేస్తున్న కృషిని పునరుద్ఘాటించారు. ‘‘దీర్ఘకాలంగా.. పోలీసులు అందిస్తున్న సహకారాన్ని మనం.. అంటే దేశం పూర్తిగా గుర్తించలేదుమన పోలీసు బలగాల త్యాగాలను గౌరవించడానికి పీఎం మోదీ సారథ్యంలోని ప్రభుత్వం.. 2018లో జాతీయ పోలీసు స్మారకాన్ని నిర్మించిందిదీనికి అదనంగా.. పోలీసులకు అత్యాధునిక ఆయుధాలుమెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాంఇప్పుడు పోలీసుల వద్ద పర్యవేక్షణ వ్యవస్థలుడ్రోన్లుఫోరెన్సిక్ ప్రయోగశాలలుడిజిటల్ పోలీసింగ్ లాంటి అత్యాధునిక సౌకర్యాలున్నాయిపోలీసు బలగాలను ఆధునికీకరించడానికి సరిపడినన్ని వనరులను కూడా రాష్ట్రాలకు అందిస్తున్నాం’’ అని ఆయన వివరించారు. వనరులను పూర్తిగా ఉపయోగించుకోవాలని పిలుపునిస్తూ.. భద్రతా వ్యవస్థల సమన్వయంఏకీకరణ ద్వారానే లక్ష్యాన్ని సాధించగలమని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

సమాజంపోలీసులు ఒకరిపై ఒకరు సమాన స్థాయిలో ఆధారపడి ఉన్నారంటూనేభద్రతా వ్యవస్థ మరింత విస్తృతంగాఅప్రమత్తంగా ఉండాలంటే.. ఇద్దరి మధ్యా సమతుల బంధం అవసరమని స్పష్టం చేశారు. ‘‘పౌరులు భాగస్వాములుగా పనిచేసిచట్టాన్ని గౌరవించినప్పుడు మాత్రమే పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయగలదుపరస్పర అవగాహనబాధ్యత అనే మూలాలపై ఆధారపడి సమాజంపోలీసుల మధ్య అనుబంధం ఏర్పడినప్పడు రెండూ వృద్ధి చెందుతాయి’’ అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్), ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా కవాతు నిర్వహించారుకేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్హోం శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్ఇంటిలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ శ్రీ తపన్ డేకాబీఎస్ఎఫ్ డీజీ శ్రీ దల్జీత్ సింగ్ చౌధరిసీఏపీఎఫ్‌లకు చెందిన ఇతర ఉన్నతాధికారులుపదవీ విరమణ చేసిన డీజీలుపోలీసు వర్గాలకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

****


(Release ID: 2181401) Visitor Counter : 4