ప్రధాన మంత్రి కార్యాలయం
బొలీవియా అధ్యక్షుడిగా ఎన్నికైన గౌరవనీయ రోడ్రిగో పాజ్ పెరీరాకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
21 OCT 2025 6:37PM by PIB Hyderabad
బొలీవియా అధ్యక్షుడిగా ఎన్నికైన గౌరవనీయ రోడ్రిగో పాజ్ పెరీరాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
"బొలీవియా అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ రోడ్రిగో పాజ్ పెరీరా గారికి హృదయపూర్వక అభినందనలు. భారత్-బొలీవియా మధ్య సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలు చాలా కాలంగా మన పరస్పర ప్రయోజనకరమైన సహకారానికి మద్దతునిస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో మన ఉమ్మడి పురోగతి, శ్రేయస్సు కోసం ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేసుకునేందుకు నేను ఎదురుచూస్తున్నాను.
@Rodrigo_PazP”
(Release ID: 2181395)
Visitor Counter : 4
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam