వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వ్యవసాయ రంగంలో సాధించిన పురోగతిపై వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్ష

6.51 లక్షల హెక్టార్లు పెరిగిన ఖరీఫ్ సాగు :

మొత్తం 1,121.46 లక్షల హెక్టార్లకు చేరుకున్న సాగు విస్తీర్ణం


బఫర్ నిబంధనల కంటే అధికంగా ఉన్న బియ్యం, గోధుమ నిల్వలు
సంతృప్తికర స్థాయిలో దేశవ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటి మట్టాలు.. మెరుగైన దిగుబడికి అవకాశాలు

Posted On: 13 OCT 2025 3:48PM by PIB Hyderabad

 

వ్యవసాయ రంగంలో సాధించిన పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర వ్యవసాయంరైతు సంక్షేమంగ్రామీణాభివృద్ధి మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ అధ్యక్షతన ఈ రోజు ఉన్నతస్థాయి సమావేశం జరిగిందిఖరీఫ్ పంట పరిస్థితులురబీ నాట్ల సన్నద్ధతవరద ప్రభావిత ప్రాంతాల్లో పంటల పరిస్థితిధరల స్థితిగతులుఎరువుల లభ్యతరిజర్వాయర్లలో నీటిమట్టాల స్థాయులకు సంబంధించి ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారుఅలాగే సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలను సైతం కేంద్ర మంత్రి జారీ చేశారు.

గతేడాదితో పోలిస్తే ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 6.51 లక్షల హెక్టార్లు పెరిగిందని అధికారులు తెలియజేశారుమొత్తం సాగు విస్తీర్ణం 1,121.46 లక్షల హెక్టార్లకు చేరుకుందిఇది 2024–25లో 1,114.95 లక్షల హెక్టార్లుగా ఉందిగతేడాదితో పోలిస్తే ప్రధాన పంటలైన గోధుమవరిజొన్నచెరకుపప్పు ధాన్యాల సాగు రికార్డు స్థాయిలో పెరిగిందని వివరించారుమినుము సాగు విస్తీర్ణం 2024–25లో 22.87 లక్షల హెక్టార్ల నుంచి 2025–26లో 24.37 లక్షలకు అంటే 1.50 లక్షల హెక్టార్ల మేర పెరిగింది.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సైతం కేంద్ర మంత్రి సమీక్షించారుకొన్ని రాష్ట్రాల్లో వరదలుకొండచరియలు విరిగి పడిన ప్రభావిత జిల్లాలను శ్రీ చౌహాన్ ఇటీవల సందర్శించారుఅధిక వర్షపాతం కారణంగా కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బలు తిన్నప్పటికీమరికొన్ని ప్రాంతాలు రుతుపవనాల కారణంగా లబ్ధి పొందాయనిఫలితంగా రబీ నాట్లుమొత్తం దిగుబడిని పెంచేలా పంట వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు.

టొమాటోఉల్లి సాగు ప్రక్రియ సజావుగా సాగుతోందని అధికారులు తెలియజేశారుఉల్లిసాగు విస్తీర్ణం 2024–25లో 3.62 లక్షల హెక్టార్ల నుంచి ప్రస్తుతం 3.91 లక్షల హెక్టార్లకు పెరిగిందిఅదే సమయంలో బంగాళాదుంప సాగు 0.35 లక్షల హెక్టార్ల నుంచి 0.43 లక్షల హెక్టార్లకు పెరిగిందిఅదేవిధంగా.. టొమాటో సాగు విస్తీర్ణం గతేడాది 1.86 లక్షల హెక్టార్ల నుంచి ఈ ఏడాది 2.37 లక్షల హెక్టార్లకు విస్తరించిందినిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా బంగాళాదుంపఉల్లిటొమాటో సాగు విస్తీర్ణం పెరుగుతోందని సమావేశంలో గుర్తించారు.

 

***


(Release ID: 2178758) Visitor Counter : 16