ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో నటుడు రామ్ చరణ్, శ్రీ అనిల్ కామినేని భేటీ: విలువిద్యను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలను ప్రశంసించిన ప్రధాని
प्रविष्टि तिथि:
12 OCT 2025 9:28PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు నటుడు రామ్ చరణ్, ఆయన భార్య శ్రీమతి ఉపాసన కొణిదెల, శ్రీ అనిల్ కామినేనితో సమావేశమయ్యారు.
ప్రపంచంలోనే మొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ద్వారా విలువిద్యను ప్రోత్సహించేందుకు వారు చేపట్టిన సమష్టి యత్నాలను ప్రధానమంత్రి కొనియాడారు.
ఈ తరహా కార్యక్రమాలు విలువిద్య సంప్రదాయాన్ని పరిరక్షిస్తాయని, మరింత మంది యువత ఈ క్రీడ పట్ల ఆకర్షితులయ్యేలా స్ఫూర్తినిస్తాయని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘ఉపాసన, అనిల్ కామినేని గారూ... మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఆర్చరీకి మరింత ప్రాచుర్యాన్ని కల్పించేందుకు మీరు చేపడుతున్న ప్రయత్నాలు ప్రశంసనీయం. ఇవి యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి’’.
@AlwaysRamCharan
@upasanakonidela”
(रिलीज़ आईडी: 2178504)
आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam