ప్రధాన మంత్రి కార్యాలయం
భారత ప్రగతి ప్రయాణంలో అరుణాచల్ ప్రదేశ్ కీలక పాత్రను స్పష్టం చేసిన కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
11 OCT 2025 1:51PM by PIB Hyderabad
దేశ ప్రగతి ప్రయాణంలో అరుణాచల్ ప్రదేశ్ సాధించిన పరివర్తన, పెరుగుతున్న ప్రాముఖ్యాన్ని స్పష్టం చేస్తూ కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
తొలిసారిగా ఈశాన్య ప్రాంతం సరిహద్దు ప్రాంతం కాదనీ.. భారత ప్రగతి ప్రయాణంలో దాని పాత్ర కీలకమని నిరూపితమైందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కొత్త విమానాశ్రయాల నుంచి సాధికారత సాధించిన స్వయం సహాయక బృందాల వరకు.. అనుసంధానత నుంచి సృజనాత్మకత వరకు.. అరుణాచల్ ప్రదేశ్ వికసిత్ భారత్ స్ఫూర్తికి అద్దం పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
కేంద్ర మంత్రి రాసిన వ్యాసానికి స్పందిస్తూ, శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
"మొదటిగా ఈశాన్య ప్రాంతం సరిహద్దు కాదు.. ఇది భారత ప్రగతి ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తుందని నిరూపితమైంది. కొత్త విమానాశ్రయాల నుంచి సాధికారత సాధించిన స్వయం సహాయక సంఘాల వరకు.. అనుసంధానత నుంచి సృజనాత్మకత వరకు.. అరుణాచల్ ప్రదేశ్ వికసిత్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. కేంద్ర మంత్రి శ్రీ @JM_Sindia రాసిన వ్యాసం తప్పక చదవవలసినది."
(रिलीज़ आईडी: 2177971)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam