ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచ పారా-అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2025లో చరిత్రాత్మక ప్రదర్శన కనబరిచిన భారత బృందానికి ప్రధాని శుభాకాంక్షలు
Posted On:
06 OCT 2025 4:28PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ పారా-అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2025లో చరిత్రాత్మక ప్రదర్శన కనబరిచిన భారత పారా అథ్లెట్ బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు. ఈ పోటీల్లో భారత్ అత్యుత్తమ సంఖ్యలో పతకాలను సాధించింది. 6 స్వర్ణాలతో సహా 22 పతకాలను సొంతం చేసుకుని, జాతీయ పారా క్రీడల ప్రయాణంలో సరికొత్త విజయాన్ని నమోదు చేసింది. ఈ తరహా ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ కార్యక్రమాన్ని మొదటిసారి భారత్‌లో నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో శ్రీ మోదీ ఇలా అన్నారు:
‘‘మన పారా-అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేశారు!
ఈ ఏడాది ప్రపంచ పారా-అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ చాలా ప్రత్యేకమైనవి. ఆరు స్వర్ణాలతో సహా 22 పతకాలను సాధించి భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. మన క్రీడాకారులకు శుభాకాంక్షలు. వారి విజయం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. మన జట్టులోని ప్రతి క్రీడాకారుడిని చూసి గర్విస్తున్నాను. వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.
ఢిల్లీలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం భారత్‌కు గర్వకారణం. ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్న దాదాపు 100 దేశాలకు చెందిన క్రీడాకారులు, వారి సహాయకులకు ధన్యవాదాలు "
***
(Release ID: 2175854)
Visitor Counter : 5
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada