ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అక్టోబరు 8,9 తేదీల్లో మహారాష్ట్రలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటన


నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటో దశను

ప్రారంభించనున్న ప్రధానమంత్రి.. నిర్మాణ వ్యయం సుమారు రూ.19,650 కోట్లు


ముంబయి మెట్రో లైన్-3 ఆఖరి దశను ప్రారంభించనున్న ప్రధానమంత్రి.. ముంబయి మెట్రో లైన్-3ను

దేశ ప్రజలకు అంకితం చేయనున్న ప్రధానమంత్రి.. నిర్మాణ వ్యయం రూ.37,270 కోట్ల కన్నా ఎక్కువ



ముంబయి వన్ యాప్ ను ఆవిష్కరించనున్న ప్రధానమంత్రి

దేశంలో 11 ప్రజా రవాణా సేవా సంస్థలతో కామన్ మొబిలిటీ యాప్


నిరంతరాయ సంధానానికి పూచీ పడే ఉద్దేశంతో ముఖ్య పథకాలకు శుభారంభం


భారత్-యూకే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృఢతరం చేస్తూ

యూకే ప్రధానితో ముంబయిలో భేటీ కానున్న ప్రధానమంత్రి శ్రీ మోదీ


భారత్-యూకే వ్యూహాత్మక భాగస్వామ్యం, విజన్ 2035లపై

ప్రధానమంత్రి శ్రీ మోదీ, ప్రధాని శ్రీ స్టార్మర్‌ సమీక్ష


గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025లో కీలకోపన్యాసమివ్వనున్న ప్రధానమంత్రి శ్రీ మోదీ, ప్రధాని శ్రీ స్టార్మర్‌

జీఎఫ్ఎఫ్ 2025 ఇతివృత్తం: కృత్రిమ మేధ, ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్, నవకల్పన, సమ్మిళిత్వం

Posted On: 07 OCT 2025 10:30AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 8, 9వ తేదీల్లో మహారాష్ట్రలో పర్యటిస్తారుప్రధానమంత్రి మధ్యాహ్నం సుమారు గంటలకు నవీ ముంబయికి చేరుకొంటారుకొత్తగా కట్టిన నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆయన పరిశీలిస్తారుఆ  తరువాతసుమారు మూడున్నర గంటల వేళకుప్రధానమంత్రి నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు ముంబయిలో వివిధ పథకాలను కూడా ప్రారంభించిజాతికి అంకితమిస్తారుఈ సందర్భంగా జనసమూహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

ఈ నెల 9న ఉదయం సుమారు 10 గంటల వేళ ప్రధానమంత్రి ముంబయిలో యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్‌తో భేటీ అవుతారుమధ్యాహ్నం దాదాపుగా ఒంటి గంటా నలభై  నిమిషాలకురెండు దేశాల ప్రధానులూ ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో సీఈఓ ఫోరానికి హాజరవుతారుమధ్యాహ్నం సుమారు 2:45 గంటలకువారు ఇద్దరూ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌ 6వ సంచికలో పాల్గొంటారుఆ కార్యక్రమంలో వారు కీలకోపన్యాసాన్నిస్తారు.

నవీ ముంబయిలో ప్రధానమంత్రి
ఇండియాను ప్రపంచ విమానయాన కూడలిగా తీర్చిదిద్దాలన్న తన దృష్టికోణానికి అనుగుణంగాప్రధానమంత్రి నవీ ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఎన్ఎంఐఏఒకటో దశను ప్రారంభిస్తారుదాదాపు రూ.19,650 కోట్లు ఖర్చు పెట్టి ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు.

నవీ ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ భారతదేశంలో కొత్తగా నిర్మించిన అతి పెద్ద విమానాశ్రయందీనిని ప్రభుత్వప్రయివేటు భాగస్వామ్య (పీపీపీపద్ధతిలో అభివృద్ధి చేశారుముంబయి మహానగర  ప్రాంతంలో రెండో అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉండే ఎన్ఎంఐఏ.. ఛత్రపతి శివాజీ  మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (సీఎస్ఎంఐఏ)తో పాటు సేవలందిస్తూ ముంబయిలో రద్దీని తగ్గించిఈ నగరాన్ని ప్రపంచంలో బహుళ విమానాశ్రయాలున్న నగరాల సరసన నిలబెడుతుంది. 1160 హెక్టార్ల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అత్యంత సమర్ధవంతంగా సేవలను అందించే విధంగా తీర్చిదిద్దిన ఈ విమానాశ్రయం మరికొంత కాలంలో ఏడాదికి కోట్ల మంది ప్రయాణికులకు సేవలను అందించడంతో పాటు 3.25 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకులను రవాణా చేయగలుగుతుంది.

మొత్తం నాలుగు ప్రయాణికుల టర్మినళ్ల నుంచీ ప్యాసింజర్లు ఒక టర్మినల్ నుంచి మరో టర్మినల్‌లోకి వెళ్లేందుకు వీలుగా ఆటోమేటెడ్ పీపుల్ మూవర్ (ఏపీఎమ్వ్యవస్థనగరం వైపు మౌలిక సదుపాయాల వ్యవస్థతో కలిపే ల్యాండ్‌సైడ్ ఏపీఎంతో లంకె పెట్టడం వంటి విశిష్ట సేవలను ఇక్కడ అందుబాటులోకి తీసుకువచ్చారుసస్టయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (ఎస్ఏఎఫ్కోసం ఉద్దేశించిన ఒక ప్రత్యేక నిల్వ సదుపాయంసుమారు 47 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పాదక సామర్థ్యం కలిగిన కేంద్రంప్రయాణికులను నగరంలోని వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు ఈవీ బస్సు సేవలు ఈ  విమానాశ్రయంలో లభిస్తాయిదేశంలో మొదటి సారి ‘వాటర్ ట్యాక్సీ’ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే విమానాశ్రయం కూడా నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయమే కానుంది.
సుమారు రూ.12,200 కోట్ల అంచనా ఖర్చుతో ఆచార్య అత్రే చౌక్ నుంచి కఫ్ పరేడ్ వరకు విస్తరించిన ముంబయి మెట్రో లైన్-3 లోని 2బీ దశను ప్రధానమంత్రి ప్రారంభిస్తారుదీంతోఆయన మొత్తం రూ. 37,270 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చుతో నిర్మాణం పూర్తి చేసుకున్న ముంబయి మెట్రో లైన్-3 (ఆక్వా లైను)ను దేశ ప్రజలకు అంకితం చేస్తారుఇది గనర పట్టణ రవాణా మార్పు దిశలో ఒక ప్రధాన ఘట్టంగా చరిత్రలో నిలవబోతోంది.

ముంబయిలో మొదటిఒకే ఒక పూర్తి భూగర్భ మెట్రో లైనుగా నిలిచే ఈ ప్రాజెక్టు ముంబయి మహానగర ప్రాంతం (ఎమ్ఎమ్ఆర్)లో రాకపోకలకు సరికొత్త నిర్వచనాన్ని ఇవ్వబోతోందిఅంతేకాదులక్షల మంది నివాసితులకు వేగవంతమైనమరింత సమర్థమైనఆధునిక రవాణా సాధనం అందుబాటులోకి వస్తుంది కూడా.

కఫ్ పరేడ్ నుంచి ఆరే జేవీఎల్ఆర్ వరకు 33.5 కిలోమీటర్ల పొడవైన, 27 స్టేషన్లతో కూడి ఉండే ముంబయి మెట్రో లైన్-3 ప్రతి రోజూ 13 లక్షల మంది ప్రయాణికుల అవసరాలను తీరుస్తుందిఈ ప్రాజెక్టులో చివరిదైన 2బీ దశ దక్షిణ ముంబయిలోని వారసత్వాన్నీసాంస్కృతిక జిల్లాలైన ఫోర్ట్కాలా ఘోడా, మెరైన్ డ్రైవ్ వరకు నిరంతరాయ అనుసంధానాన్ని అందిస్తుందిదీంతో పాటు బాంబే హై కోర్టుమంత్రాలయభారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ), బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (బీఎస్ఈ), నారీమన్ పాయింట్ సహా ప్రధాన పరిపాలఆర్థిక కూడళ్ల వరకు నేరుగా సేవల్ని అందిస్తుంది.

రైల్వేలువిమానాశ్రయాలుఇతర మెట్రో లైన్లతో పాటు మోనోరైల్ సేవల వంటి ఇతర రవాణా సాధనాలతో సమర్థ ఏకీకరణకు అనువుగా మెట్రో లైన్-3కు రూపకల్పన చేశారుదీంతో చివరి అంచె వరకు సంధానంలో మెరుగుదల సాధ్యపడుతుందిమహానగర ప్రాంతంలో రద్దీ కూడా ఇప్పటి కన్నా తగ్గుతుంది.

ప్రధానమంత్రి ‘‘ముంబయి వన్’’ను కూడా ప్రారంభిస్తారుముంబయి వన్ 11 ప్రజారవాణా సేవల నిర్వహణ సంస్థలను దృష్టిలో పెట్టుకొని తీసుకువచ్చిన ఏకీకృత ఉమ్మడి మొబిలిటీ యాప్ఈ 11 ప్రజారవాణా  సేవా నిర్వహణ సంస్థల్లో ముంబయి మెట్రో లైన్ 2, 7, ముంబయి మెట్రో లైన్ 3, ముంబయి మెట్రో లైన్ 1, ముంబయి మోనోరైల్నవీ ముంబయి  మెట్రోముంబయి సబర్బన్ రైల్వేబృహన్ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బీఈఎస్‌టీ), ఠాణే మ్యూనిసిపల్ ట్రాన్స్‌పోర్ట్మీరా భయందర్ మునిసిపల్ ట్రాన్స్‌పోర్ట్కల్యాణ్ డోంబివలీ మునిసిపల్ ట్రాన్స్‌పోర్ట్‌లతో పాటు నవీ ముంబయి మునిసిపల్ ట్రాన్స్‌పోర్ట్ ఉన్నాయి.
ముంబయి వన్ యాప్ ప్రయాణికులకు అనేక విధాల ప్రయోజనాలను అందిస్తుందివీటిలో పలు ప్రజారవాణా సేవా నిర్వహణ సంస్థలు ఉపయోగించుకోగలిగే ఏకీకృత మొబైల్ యాప్. టికెట్ జారీడిజిటల్ లావాదేవీలను అమల్లోకి తేవడం ద్వారా ప్రయాణికులు టిక్కెట్ల కోసం బారులు తీరే పద్ధతికి స్వస్తి పలకడంబహుళవిధ రవాణా సాధనాలకు ఒకే డైనమిక్ టికెట్ పద్ధతిని తెస్తున్నారు. ఇది ఆలస్యంప్రత్యామ్నాయ మార్గాలు ఏమేమిటిఏ వేళకు వచ్చేదీ వాస్తవిక సమయం ఆధారంగా తాజా సమాచారాన్ని తెలియజేయడంచుట్టుపక్కల ఉన్న స్టేషన్లుఆకర్షణీయ స్థలాలుదర్శనీయ స్థలాల గురించిన మ్యాప్ ఆధారిత సమాచారంప్రయాణికుల భద్రతకు  పూచీపడడానికి ఒక ఎస్ఓఎస్ సౌకర్యాన్ని కూడా అందిస్తుందిఇవన్నీ కలిసి సౌకర్యందక్షతభద్రతలను పెంచుతాయిదీంతో పూర్తి ముంబయిలో ప్రజారవాణా అనుభూతి మారిపోవడం తథ్యం.  

ఉపాధియోగ్యతను అందించే స్వల్పకాలిక కార్యక్రమాన్ని (ఎస్‌టీఈపీకూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారుఈ మార్గదర్శక కార్యక్రమాన్ని మహారాష్ట్రలో నైపుణ్యంఉపాధిఔత్సాహిక పారిశ్రామికత్వంనవకల్పన విభాగం తీసుకువచ్చిందిదీనిని 400 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థల్లోనూ (ఐటీఐలు), 150 ప్రభుత్వ సాంకేతిక ఉన్నత పాఠశాలల్లోనూ మొదలుపెడతారునైపుణ్యాభివృద్ధి ప్రక్రియను పరిశ్రమ అవసరాలతో ముడిపెట్టే దిశగా ఇది ఒక పెద్ద కార్యక్రమంగా నిలవబోతోందిఎస్‌టీఈపీలో భాగంగా 2,500 కొత్త శిక్షణ బ్యాచులను ఏర్పాటు చేస్తారుదీనిలో మహిళల కోసం 364 ప్రత్యేక బ్యాచులుకృత్రిమ మేధ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), విద్యుత్తు వాహనాలు (ఈవీ), సౌర శక్తియాడిటివ్ మాన్యుఫాక్చరింగ్ వంటి సరికొత్తగా ఉనికిలోకి వస్తున్న సాంకేతికత ప్రధాన పాఠ్యక్రమాలను నేర్చుకొనే 408 బ్యాచులు కలిసి ఉంటాయి.

 

యూకే ప్రధాని పర్యటనగ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని అందుకొనియునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ ఈ నెల 8, 9వ తేదీల్లో భారత్‌ పర్యటనకు రాబోతున్నారుప్రధాని శ్రీ స్టార్మర్ ఇండియాలో అధికార పర్యటనకు రావడం ఇదే మొదటి సారి.

ఈ పర్యటన కాలంలోప్రధానమంత్రులు ఇద్దరూ ‘విజన్ 2035’కు అనుగుణంగా భారత్-యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం తాలూకు విభిన్న అంశాల్లో చోటుచేసుకున్న ప్రగతిని సమీక్షిస్తారువిజన్ 2035 వ్యాపారంపెట్టుబడిసాంకేతికతనవకల్పనరక్షణభద్రతవాతావరణ మార్పుఇంధనంవైద్యంవిద్యరెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాల వంటి ముఖ్య రంగాల్లో పది సంవత్సరాల్లో చేపట్టదగిన కార్యక్రమాలను వివరించే ఒక మార్గసూచీ.

నేతలిద్దరూ వాణిజ్య సంస్థలపరిశ్రమ రంగ ప్రముఖులతో భారత్-యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ)లో పొందుపరిచిన అవకాశాలపై చర్చిస్తారుసీఈటీఏ భారత్యూకే ఆర్థిక భాగస్వామ్యంలో ఒక ముఖ్య కారకంగా ఉందినేతలు ప్రాంతీయఅంతర్జాతీయ ప్రాధాన్యం కల అంశాలపై తమ ఆలోచనలను పంచుకొంటారుఇద్దరు నేతలూ పరిశ్రమ నిపుణులతోవిధాన రూపకర్తలతోఆవిష్కర్తలతో కూడా సమావేశమవుతారు.

ప్రధానమంత్రితో పాటు ప్రధాని శ్రీ స్టార్మర్ ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌ 6వ సంచికలో కూడా పాల్గొంటారువారు ఈ సందర్భంగా కీలకోపన్యాసాలిస్తారు.

గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌ 2025లో ప్రపంచం నలు మూలల నుంచీ ఆవిష్కర్తలువిధాన రూపకర్తలుకేంద్ర బ్యాంకుల సారథులునియంత్రణ సంస్థల ప్రధానాధికారులుఇన్వెస్టర్లువిద్య రంగ ప్రముఖులుపరిశ్రమ రంగ ప్రముఖులు పాలుపంచుకొంటారు. ‘ఎంపవరింగ్ ఫైనాన్స్ ఫర్ ఏ బెటర్ వరల్డ్’ను (ఉత్తమ ప్రపంచాన్ని ఆవిష్కరించడం కోసం ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడంఈ సమావేశపు ముఖ్యాంశంగా తీసుకున్నారుఏఐఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్నవకల్పనలతో పాటు సమ్మిళిత్వం.. వీటి సాయంతో నైతికత ప్రధానమైనసుస్థిర ఆర్థిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సాంకేతిక విజ్ఞ‌ానంమనిషిలో లోతైన అవగాహన.. ఈ రెంటినీ కలబోయాలన్నది ఈ సమావేశపు చర్చనీయాంశం.

ఈ సంవత్సరం నిర్వహించే సంచికలో 75 కన్నా ఎక్కువ దేశాల నుంచి 1,00,000 మందికి పైగా ప్రతినిధులు పాలు పంచుకోనుండటంతో, ప్రపంచంలో అతి పెద్ద ఫిన్‌టెక్ సమ్మేళనాల్లో ఒకటిగా మారుతుందిఈ కార్యక్రమంలో సుమారు 7,500 వాణిజ్య సంస్థలు, 800 మంది వక్తలు, 400 మంది ప్రదర్శనకారులుభారతీయఅంతర్జాతీయ అధికార పరిధులకు ప్రాతినిధ్యం వహించే 70 మంది నియంత్రణ సంస్థల ప్రధాన అధికారులు పాల్గొంటారు.

ఈ కార్యక్రమంలో సింగపూర్‌కు చెందిన మానిటరీ అథారిటీజర్మనీకి చెందిన డాయిష్ బుండెస్‌ బ్యాంకుఫ్రాన్స్‌కు చెందిన బ్యాంక్ డీ ఫ్రాన్స్‌తో పాటు స్విట్జర్లాండుకు చెందిన స్విస్ ఫైనాన్షియల్ మార్కెట్ సూపర్‌వైజరీ అథారిటీ (ఎఫ్ఐఎన్ఎమ్ఏవంటి ప్రసిద్ధ అంతర్జాతీయ నియంత్రణాధికార సంస్థలు పాల్గొంటున్నాయివాటి భాగస్వామ్యం ఆర్థిక విధాన చర్చసహకారం అంశాల్లో ప్రపంచ స్థాయి వేదికగా జీఎఫ్ఎఫ్‌కు సత్తా నానాటికీ వృద్ధి చెందుతోందని స్పష్టం చేస్తోంది.


(Release ID: 2175834) Visitor Counter : 10