ప్రధాన మంత్రి కార్యాలయం
స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్‌ను ప్రభావవంతంగా, భారత నారీశక్తికి ప్రయోజనకరంగా మార్చేందుకు క్షేత్రస్థాయిలో కృషిచేసిన వారికి ప్రధాని అభినందన
Posted On:
04 OCT 2025 3:41PM by PIB Hyderabad
స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ ను ప్రభావవంతంగా, భారత నారీ శక్తికి ప్రయోజనకరంగా ఉండేలా అవిశ్రాంతంగా కృషి చేసిన వారందరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు.
ప్రజల భాగస్వామ్యమైన జన్ భాగీదారీకి ఈ కార్యక్రమాన్ని ఓ అద్భుత ఉదాహరణగా అభివర్ణించిన ప్రధానమంత్రి.. ప్రజల జీవనాన్ని మెరుగుపరచడానికి, ఆరోగ్యకరమైన, సాధికారత కలిగిన సమాజాన్ని నిర్మించడానికి ఇటువంటి సమష్టి చర్యలు అత్యావశ్యకమని స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీ జె.పి. నడ్డా చేసిన ఓ పోస్టుపై స్పందిస్తూ శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“అద్భుత కృషి! ఈ కార్యక్రమాన్ని చాలా ప్రభావవంతంగా, మన నారీ శక్తికి ప్రయోజనకరంగా ఉండేలా క్షేత్రస్థాయిలో పనిచేసిన వారికి అభినందనలు. జన్ భాగీదారితో ప్రజా జీవితాల మెరుగుదలకు ఇది గొప్ప ఉదాహరణ.”
(Release ID: 2175019)
Visitor Counter : 6
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam