ప్రధాన మంత్రి కార్యాలయం
ఢిల్లీ చిత్తరంజన్ పార్క్ దుర్గా పూజా వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి ప్రజలందరీ ఆనందం, క్షేమాన్ని కోరుతూ ప్రార్థన
Posted On:
30 SEP 2025 9:24PM by PIB Hyderabad
మహాష్టమి శుభ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్‌లో నిర్వహించిన దుర్గా పూజ వేడుకల్లో పాల్గొన్నారు.
చిత్తరంజన్ పార్క్‌కు బెంగాలీ సంస్కృతితో బలమైన అనుబంధం ఉందన్న ప్రధానమంత్రి.. ఇక్కడ జరిగే వేడుకలు సమాజంలో ఐక్యత, సాంస్కృతిక చైతన్యాన్ని తెలియజేస్తాయని పేర్కొన్నారు.
ప్రజలందరి అనందం, సంక్షేమం కోసం ఆయన ప్రార్థనలు చేశారు.
వేడుకలోని ముఖ్యాంశాలను ప్రధాని పంచుకుంటూ.. “ఢిల్లీలోని గుర్తుండిపోయే దుర్గాపూజ వేడుకలోని ముఖ్యాంశాలు! అంతటా ఆనందం, సంక్షేమం నెలకొనాలి” అని అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
"ఈ రోజు మహాష్టమి శుభ సందర్భంగా నేను దుర్గా పూజ వేడుకల్లో పాల్గొనడానికి ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్‌కు వెళ్లాను. బెంగాలీ సంస్కృతితో చిత్తరంజన్ పార్క్‌కు బలమైన అనుబంధం ఉంది. ఈ వేడుకలు మన సమాజంలో ఐక్యత, సాంస్కృతిక చైతన్యాన్ని నిజంగా తెలియజేస్తాయి. అందరి ఆనందం, శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశాను."
“ఢిల్లీలో జరిగిన గుర్తుండిపోయే దుర్గా పూజ వేడుక ముఖ్యాంశాలు! అంతటా ఆనందం, శ్రేయస్సు నెలకొనాలని కోరుకుంటున్నాను.. ”
(Release ID: 2173537)
Visitor Counter : 5
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam