ప్రధాన మంత్రి కార్యాలయం
ఆయుష్మాన్ భారత్ ను ప్రారంభించి ఏడేళ్లయిందన్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
23 SEP 2025 12:52PM by PIB Hyderabad
ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ... ఈ పథకం కోట్లాది మందికి నాణ్యమైన ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందని, ఆర్థిక భద్రత, గౌరవాన్ని కల్పించటం ద్వారా ఆరోగ్య సేవలకు కొత్త నిర్వచనమిచ్చిందన్నారు.
మై గవ్ ఇండియాకు పోస్టుకు ప్రతిస్పందిస్తూ 'ఎక్స్' పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"ఈరోజు మనం ఆయుష్మాన్ భారత్ పథకానికి ఏడేళ్లు పూర్తి చేసుకున్నాం! భవిష్యత్ అవసరాలను ముందే ఊహించి, ప్రజలకు నాణ్యమైన, తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలను అందించేందుకు దీన్ని ప్రారంభించాం. దీనివల్ల ప్రజారోగ్య రంగంలో ఒక విప్లవం వచ్చింది. ఇది ప్రజలకు ఆర్థిక భద్రతను, గౌరవాన్ని కల్పించింది. దయాగుణం, సాంకేతిక పరిజ్ఞానంతో పెద్దఎత్తున ప్రజలను శక్తిమంతులను చేయవచ్చని భారత్ నిరూపించింది.”
*****
MJPS/SR/SKS
(रिलीज़ आईडी: 2170179)
आगंतुक पटल : 53
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam