హోం మంత్రిత్వ శాఖ
నవరాత్రి పర్వదిన సందర్భంగా దేశంలోని అమ్మలకు, చెల్లెళ్లకు తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలతో బహుమతినందించిన మోదీ ప్రభుత్వం: కేంద్ర హోంశాఖ, సహాకార మంత్రిత్వశాఖ మంత్రి అమిత్ షా
దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన వాగ్దానం
మేరకు నేటి నుంచి అమల్లోకి జీఎస్టీ సంస్కరణలు
చారిత్రాత్మకంగా 390 కంటే ఎక్కువ వస్తువులపై జీఎస్టీ తగ్గింపు
‘‘ఆత్మనిర్భర్ భారత్’’ లక్ష్యాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించనున్న తదుపరి సంస్కరణలు
పేదలు, యువత, రైతులు, మహిళలకు సేవ చేయాలన్న
మోదీ గారి దృఢ సంకల్పానికి ఈ సంస్కరణలు నిదర్శనం
పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ తొలగింపు, సబ్బు, టూత్‌బ్రష్, షాంపూ వంటి నిత్యావసరాలపై
పన్ను తగ్గింపుతో సమాజంలోని ప్రతి ఇంటా సంతోషాల వెల్లువ.
వ్యవసాయం, ఆరోగ్యం, వస్త్ర పరిశ్రమ, మ్యాన్ మేడ్ ఫైబర్ రంగంలో
తయారీని ప్రోత్సహించనున్న పన్ను తగ్గింపు
ఆహారం, గృహోపకరణాలు, ఇంటి నిర్మాణ సామగ్రి, వాహనాలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం,
బీమా వంటి రంగాలపై జీఎస్టీ తగ్గింపుతో ప్రజల జీవితాల్లో చిరునవ్వు, పెరగనున్న పొదుపు
స్వదేశీ ఉత్పత్తులతో ప్రతి ఇంటినీ ఆత్మనిర్భర్ భారత్ కు స్పూర్తిగా మార్చండి
దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలంటూ కేంద్ర మంత్రి పిలుపు.
Posted On:
22 SEP 2025 1:17PM by PIB Hyderabad
నవరాత్రి పర్వదిన సందర్భంగా దేశంలోని అమ్మలకు, చెల్లెళ్లందరికీ మోదీ ప్రభుత్వం తదుపరితరం జీఎస్టీ సంస్కరణలను బహుమతిని అందించిందని కేంద్ర హోంశాఖ, సహాకార మంత్రిత్వశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
ఎక్స్ మాధ్యమంలో కేంద్రహోంశాఖ, సహాకారశాఖ మంత్రి చేసిన పోస్టులో.. ‘‘నవరాత్రి పండుగ సందర్భంగా దేశంలోని తల్లులందరికీ, చెల్లెళ్లందరికీ మోదీ ప్రభుత్వం తదుపరి తరం సంస్కరణల బహుమతిని అందించింది. దేశ ప్రజలకు ప్రధాని శ్రీ మోదీ చేసిన జీఎస్టీ సంస్కరణల వాగ్దానం నేటి నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ సంస్కరణలు 390కి పైగా వస్తువులపై పన్ను భారం తగ్గింది. ఆహారం, గృహోపకరణాలు, గృహ నిర్మాణ సామగ్రి, వాహనాలు, వ్యవసాయం, బొమ్మలు, క్రీడలు, హస్తకళలు, విద్య, వైద్యం, భీమా వంటి రంగాలపై జీఎస్టీ ఉపశమనం.. ప్రజల జీవితాల్లో ఆనందాన్ని తెవడమే కాకుండా వారి పొదుపును పెంచుతుంది’’ అని తెలిపారు.
ఆత్మనిర్భర భారత్ సంకల్పాన్ని సాకారం చేయడంలో జీఎస్టీ సంస్కరణలు కీలపాత్ర పోషిస్తాయని కేంద్రమంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. దేశాన్ని ఉద్దేశించి ప్రధాని శ్రీ మోదీ ఇచ్చిన ప్రసంగంలో.. స్వదేశీ ఉత్పత్తులను వాడకాన్ని పెంచాలని పిలుపునిచ్చారని, ఈ సంస్కరణలు ఆత్మనిర్భర భారత్ ను ఎలా బలోపేతం చేస్తాయో వివరించారని తెలిపారు. వ్యవసాయం, వైద్యం, వస్త్రాలు, మ్యాన్ మేడ్ ఫైబర్ వంటి రంగాల్లో జీఎస్టీని తగ్గించడం ద్వారా తయారీని పెంచేందుకు సహయపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో స్వదేశీ ఉత్పత్తుల వాడాకాన్ని పెంచడం ద్వారా స్వావలంబన దేశాన్ని రూపొందించడానికి దోహదపడవచ్చని చెప్పారు.
మధ్య తరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేందుకు మోదీ ప్రభుత్వం అనేక అవకాశాలను కల్పిస్తూ.. వారి పొదుపు శక్తిని నిరంతరం పెంచేలా జీఎస్టీ సంస్కరణలను అమలు చేస్తోందని కేంద్ర హోంమంత్రి తెలిపారు. నిత్యావసరాలు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, విద్యా వస్తువులపై జీఎస్టీ రేట్లను గణనీయంగా తగ్గించడం వల్ల వారి ఆదాయాలతోపాటు పొదుపు మొత్తాలను పెంచేందుకు ప్రోత్సహిస్తుందని అన్నారు.
పేదలు, యువత, రైతులు, మహిళలకు సేవ చేయాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృఢ సంకల్పానికి తాజా జీఎస్టీ సంస్కరణలు నిదర్శనమని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ఈ సంస్కరణలుతో అనేక వస్తువులపై జీఎస్టీ రేట్లు భారీగా తగ్గడంతో ప్రజల ఖర్చులు మరింత తగ్గనున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా మారే దిశగా దేశ వృద్ధి చక్రాన్ని మరింత వేగంగా పరుగులు పెట్టించనుంది.
అనేక పాల ఉత్పత్తులపై జీఎస్టీ తొలగింపు లేదా సబ్బు, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, హెయిర్ ఆయిల్, షాంపూ వంటి నిత్యావసరాలపై తాజా జీఎస్టీ సంస్కరణలు ప్రతి ఇంటిలో సంతోషానిచ్చే బహుమతిని తెస్తుందని కేంద్ర హోం మంత్రి, సహకార మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. జీవిత బీమా, ఆరోగ్య బీమా, వయోవృద్ధుల పాలసీలు, ప్రాణాలను రక్షించే 33 మందులు, డయాగ్నాస్టిక్ కిట్లపై జీఎస్టీ తొలగింపు నుంచి ఆక్సిజన్, శస్త్రచికిత్సా పరికరాలు, వైద్య, దంత, పశువైద్య పరికరాలపై జీఎస్టీ తగ్గింపు వరకూ.. ఈ సంస్కరణలు ప్రజల పొదుపుల్లో చారిత్రాత్మక పెరుగుదలకు దారితీయనుంది. వ్యవసాయ పరికరాలు, ఎరువుల రంగాల్లో జీఎస్టీ తగ్గింపుతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ప్రజలు వాహనాలను కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తాజా జీఎస్టీ సంస్కరణలు ఆత్మ నిర్భర భారత్ కు దోహదపడనున్నాయి. అందరూ తమ రోజువారీ వినియోగంలో స్వదేశీ ఉత్పత్తుల వాడకాన్ని పెంచి ఆత్మనిర్భర భారత్ సాధనలో తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు.
(Release ID: 2169678)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam