ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సహకార రంగంలో అనేక కీలక కార్యక్రమాల ప్రారంభంతో పాటు శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 24 FEB 2024 2:38PM by PIB Hyderabad

హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షాకేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ అర్జున్ ముండాశ్రీ పీయూష్ గోయల్జాతీయ సహకార సంఘాల అధికారులుఇతర ఉన్నతాధికారులుసోదరీ సోదరులారా.

వికసిత్ భారత్’లో ఒక భాగమైన ‘అమృత్ యాత్ర’ సాధించిన మరో ముఖ్య విజయానికి ‘భారత్ మండపం’ ఈ రోజు సాక్షిగా నిలుస్తోందిదేశం చెప్పుకొన్న ‘సహకార్ సే సమృద్ధి’ సంకల్పాన్ని నెరవేర్చుకొనే దిశలో మనం ఇవాళ మరింత ముందుకు పయనిస్తున్నాంవ్యవసాయానికీసాగుకూ పునాదిని పటిష్ఠపరచడంలో సహకార రంగం ప్రధాన పాత్రను పోషిస్తోందిదీనిని దృష్టిలో పెట్టుకొనిమేం సహకార మంత్రిత్వ శాఖ పేరిట ఒక ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాంమరి ఈ  రోజుఈ కార్యక్రమాన్ని ఇదే ఉత్సాహంతో నిర్వహించుకొంటున్నాంనేడుమన రైతుల కోసం ప్రపంచంలోనే అత్యంత భారీ నిలవ పథకాన్ని మేం ప్రారంభించాంఅదే గిడ్డంగి సదుపాయాల నిర్మాణ పథకంఈ పథకంలో భాగంగాదేశంలో మూల మూలన వేల కొద్దీ గిడ్డంగులనూగోదాములనూ నిర్మిస్తారు. 18 వేల పీఏసీఎస్‌ల (ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల)ను కంప్యూటరీకరించే ప్రధాన ప్రక్రియను కూడా పూర్తి చేశారుఈ ప్రాజెక్టులన్నీ దేశంలో వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాలకు ఒక సరికొత్త విస్తృతిని ఇస్తాయివ్యవసాయాన్ని ఆధునిక సాంకేతికతతో జోడిస్తాయిఈ ముఖ్యమైన కార్యక్రమాలకుచాలా మందికి ప్రయోజనాలను అందించే కార్యక్రమాలకు గాను మీ అందరికీ నేను మనసారా నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

మన దేశంలో ప్రాచీన కాలం నుంచి సహకార సంఘాలు ఉన్నాయిమన శాస్త్రాల్లో కూడా చెప్పారు.. ‘అల్పానామ్ అపి వస్తూనామ్సంహతికార్య సాధికా’ అనిఈ మాటలకుచిన్న చిన్న వస్తువులనూపరిమిత వనరులనూ కలిపివేస్తే వాటితో పెద్ద పెద్ద పనులను పూర్తి చేయవచ్చు అని అర్థంప్రాచీన భారతంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోసహకారానికి సంబంధించిన స్వతస్సిద్ధ స్ఫూర్తి ప్రధానమైన ఈ వ్యవస్థ తనదైన పాత్రను పోషిస్తూ వచ్చిందిమన స్వయంసమృద్ధ సమాజానికి సహకార సంఘాల భావనే పునాదిసహకారిత ఒక వ్యవస్థ మాత్రమే కాదుఅది ఒక భావనఒక ఉత్సాహంసహకార సంఘాల స్ఫూర్తి చాలా సందర్భాల్లో సంస్థలువనరుల హద్దులను దాటిచెప్పుకోదగ్గ ఫలితాలను అందిస్తుందిబతుకుదెరువుకు సంబంధించిన ఒక సీదాసాదా ఏర్పాటును సహకారం ఒక ప్రధాన పారిశ్రామిక సామర్థ్యంగా మార్చివేయగలుగుతుందిఇది ఆర్థిక వ్యవస్థనుప్రత్యేకించి దేశ గ్రామీణవ్యవసాయ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజితం చేయడానికి అనుసరించదగిన విశ్వసనీయ మార్గంవిడిగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మేం కూడా దేశానికి ఉన్న ఈ సామర్థ్యాన్నీవ్యవసాయ రంగానికి చెందిన చెల్లాచెదరైన ఈ బలాన్నీ ఏకతాటి మీదకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాంఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పీఓఅనే ఒక అతి ప్రధాన ఉదాహరణ మన ముందుందిఎఫ్‌పీఓల ద్వారాగ్రామాల్లోని చిన్న రైతులు కూడా ఇప్పుడు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగగలుగుతున్నారువారి ఉత్పాదనలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారుదేశంలో 10 వేల ఎఫ్‌పీఓలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాంప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంతోఇప్పటికే వేల ఎఫ్‌పీఓలు రూపొందాయిఅనేక ఎఫ్‌పీఓల విజయ గాథలను దేశ విదేశాల్లో చర్చిస్తున్నారుఇదే విధంగాసహకార సంఘాల ప్రయోజనాలు ప్రస్తుతం పశుపోషకులుమత్స్యకారులకు కూడా అందుతుండడం మరో సంతోషదాయకమైన మార్పు. 25 వేల కన్నా ఎక్కువ సహకార యూనిట్లు ప్రస్తుతం చేపల సాగులో నిమగ్నమయ్యాయిరాబోయే అయిదేళ్లలో, 2 లక్షల సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని పెట్టుకుందిమరివీటిలో చాలా వరకూ సహకార సంఘాలు చేపల పెంపకం రంగంలోనే ఏర్పాటవుతాయని భావిస్తున్నారు.  

మిత్రులారా,

సహకార సంఘాల శక్తి ఎంతటిదో గుజరాత్ ముఖ్యమంత్రిగా నేను పనిచేసినప్పుడు తెలుసుకున్నానుగుజరాత్లో అమూల్ విజయ గాథ ప్రస్తుతం ప్రపంచదేశాలన్నింటికీ తెలుసులిజ్జత్ పాపడ్ ప్రపంచమంతటా మార్కెట్లలో అందుబాటులో ఉన్న సంగతి కూడా మన అందరికీ తెలుసుఈ ఉద్యమాలకు ప్రధానంగా ఈ దేశ మహిళలు నాయకత్వం వహించారుమహిళలు ప్రస్తుతం సహకార రంగంపాడి రంగంవ్యవసాయ రంగాల్లో కూడా పాలుపంచుకుంటున్నారువారిలో లక్షల కొద్దీ మహిళలు చురుకైన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నారుమహిళల సామర్థ్యాలను గుర్తించిప్రభుత్వం కూడా సహకార సంఘ సంబంధిత విధానాల రూపకల్పనలో వారికి ప్రాధాన్యాన్ని ఇచ్చిందిఇటీవల మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల చట్టంలో సవరణలు చేసిన సంగతి మీకు తెలిసే ఉంటుందిదీనిలో భాగంగామల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల బోర్డులో ఇక మహిళా డైరెక్టర్ల ప్రాతినిధ్యం తప్పనిసరిపార్లమెంటులో నారీ శక్తి వందన్ అధినియమ్ ఆమోదం పొందడం దేశంలో ఎంతో మంది దృష్టిని ఆకర్షించిందిఅయితేమల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలకు సంబంధించి అంతే శక్తిమంతమైన ముఖ్య చట్టాన్నీ మేం తీసుకు వచ్చాంకానీదీనిని చాలా తక్కువ మంది మాత్రమే చర్చిస్తున్నారు.

మిత్రులారా,

సహకార సంఘాలు సామూహిక శక్తిని ఉపయోగించుకొంటూ రైతుల వ్యక్తిగత సమస్యలను తీరుస్తాయినిల్వ చేసే సామర్ధ్యమే దీనికి ఒక ప్రధాన ఉదాహరణఇంతకు ముందురైతులు నిల్వకు సంబంధించిన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చేదిఇదివరకటి ప్రభుత్వాలు ఈ అవసరాన్ని శ్రద్ధగా పట్టించుకోనేలేదుఅయితేప్రస్తుతం ఈ సమస్యను సహకార సంఘాల ద్వారా తీరుస్తున్నాంఇది ఒక పెద్ద మార్పేప్రపంచంలో అతి పెద్దదైన నిల్వ ప్రణాళికలో భాగంగావచ్చే సంవత్సరాల్లో 700 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉండే నిల్వ సదుపాయాలను సిద్ధం చేస్తాందీనికి 1.25 లక్షల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ ఖర్చవుతుందిఈ ప్రణాళిక పూర్తి అయిన తరువాతపంటలను మన రైతులు వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిలవ చేయగలుగుతారువారు బ్యాంకుల నుంచి రుణాలను సులభంగా పొందగలుగుతారుపంటను అమ్మడానికి సరైన సమయం వచ్చిందని వారు అనుకున్నప్పుడుపంటను మార్కెట్టుకు తరలించి విక్రయించగలుగుతారు.

మిత్రులారా,

వికసిత్ భారత్’‌ను ఆవిష్కరించాలంటే వ్యవసాయ వ్యవస్థలను ఆధునికీకరించడం కూడా ఎంతో ముఖ్యంవ్యవసాయ రంగంలో మనం కొత్త వ్యవస్థలను రూపొందించడంతో పాటే ‘ప్యాక్స్’ పీఏసీఎస్వంటి సహకార సంస్థలు కూడా వాటి వంతుగా కొత్త భూమికలను పోషించేందుకు తగిన సన్నాహాలను చేస్తున్నాంఈ సొసైటీలు ఇప్పుడు ‘ప్రధాన్ మంత్రీ జన్ ఔషధీ కేంద్రాలు’గా కూడా పనిచేస్తున్నాయిఇవి వేల కొద్దీ ‘ప్రధాన్ మంత్రీ కిసాన్ సమృద్ధి కేంద్రాల’ను కూడా నిర్వహిస్తున్నాయిమేం కోఆపరేటివ్ సొసైటీలను పెట్రోలుడీజిల్ రిటైల్ అవుట్‌లెట్లుగానూ మార్చాంచాలా సహకార సంఘాల్లో ప్రస్తుతం ఎల్పీజీ సిలిండర్లను కూడా పంపిణీ చేస్తున్నారుఅనేక గ్రామాల్లో ‘పానీ సమితులు’ (నీటి సంఘాలుపాత్రను కూడా ప్యాక్స్ పోషిస్తున్నాయిమరో మాటలో చెప్పాలంటేప్యాక్స్‌తో పాటు పరపతి సంఘాల ఉపయోగం కూడా పెరుగుతోందిమరి వాటికి ఆదాయార్జన మార్గాలూ పెరుగుతున్నాయికోఆపరేటివ్ సొసైటీలు ప్రస్తుతం గ్రామాల్లో ఉమ్మడి సేవా కేంద్రాలుగా ఉంటూవందల కొద్దీ ప్రభుత్వ సౌకర్యాలను అందజేస్తున్నాయిఈ సొసైటీలు కంప్యూటర్లను ఉపయోగించుకుంటూ సాంకేతిక రంగంతోను, ‘డిజిటల్ ఇండియా’తోను ముడిపడ్డ అవకాశాలను గ్రామీణ ప్రాంతాలకుఅలాగే కొత్త ఉపాధి అవకాశాలను గ్రామీణ ప్రాంతాల యువతకు అందజేయనున్నాయి.    

మిత్రులారా,

వికసిత్  భారత్’ను ఆవిష్కరించడానికి సహకార  సంఘాలు కీలక పాత్రను పోషించాలిమీ పాత్రతో  పాటు సహకార సంఘాలకున్న పాత్ర ఎంత ప్రధానమైందో నాకు తెలుసుఅందువల్లమీరు రాణించాలని నేను కోరుకుంటున్నానుచురుకుగా పనిచేసే వారిపైనే ఆశలు పెట్టుకుంటాంపనే చేయని వారినుంచి ఎవరైనా ఏం ఆశించగలరు? ‘ఆత్మనిర్భర్ భారత్’ (స్వయంసమృద్ధ భారత్నిర్మాణానికి ఎంత క్రియాశీలంగాచెప్పుకోదగ్గ స్థాయిలో తోడ్పడితే అంత త్వరగా మన లక్ష్యాలను సాధించ గలుగుతాంస్వయంసమృద్ధ భారత్‌ను సాధించకపోతే, ‘వికసిత్ భారత్’ను నిర్మించలేంమీకున్న శక్తియుక్తులనూమీ సంస్థాగత సామర్థ్యాన్నీ లెక్కలోకి తీసుకొని నేను ఆలోచించినప్పుడునాకు అనేక సూచనలు సలహాలు స్ఫురిస్తున్నాయివాటన్నింటినీ నేను ఏకబిగిన మీతో చెప్పలేను గాని ఒక విషయాన్ని సూచించాలనుకుంటున్నాఉదాహరణకుమన సహకార సంఘాలు ఏయే వస్తువులను మన దేశం విదేశాల నుంచి తెప్పించుకుంటే బాగుంటుందో ఒక పట్టికను రూపొందించాల్సిందని మీకు నేను చెబుతున్నానుఅప్పుడుఆయా వస్తువులను మనం దిగుమతి  చేసుకోంఈ విషయంలో కోఆపరేటివ్ రంగం చేయగలిగింది ఏముందిదీనిని దృష్టిలో పెట్టుకొని మనం దేశంలో ఒక సహాయక వ్యవస్థను ఏర్పాటు చేయాలిఈ బాధ్యతను సహకార సంస్థలు ఇట్టే భుజానికెత్తుకోవచ్చుఇప్పుడుఇంకో ఉదాహరణ.. మన దేశాన్ని వ్యవసాయ ప్రధాన దేశంగా పిలుస్తున్నానిజానికి గత 75 సంవత్సరాలుగా ఇదే విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పుకొంటూ వస్తున్నాం.  అయినప్పటికీఏటా వందల కోట్ల కొద్దీ డాలర్లు విలువ చేసే వంట నూనెను మనం దిగుమతి చేసుకొంటూనే ఉండడం దురదృష్టకరంవంట నూనె పరంగా మనం స్వయంసమృద్ధం అయ్యేదెలానువ్వులు పండుతోంది ఈ నెలలోనేవాటి నుంచి తీసిన నూనె మన దేశ ప్రజల ఆరోగ్యాన్ని బాగుపరచ గలుగుతుందిమరి ఈ విషయంలో సహకార రంగంలోని నా సహచరులు బాధ్యతను తీసుకోకపోతేఅప్పుడు ఇంకెవరు ఈ పనిని చేస్తారునేను సరైన మాటే చెబుతున్నానాలేదామీరు ఆ పనిని చేసి పెడతారుచేసి పెట్టరాచూడండి.. ఆఖరికి మనం వాడుతున్న వంటనూనె కూడా విదేశాల నుంచే వస్తోందిఇంధనాల విషయానికి  వద్దాం.. వాహనాలనుట్రాక్టర్లను నడపడానికి కావలసిన చమురు పెట్రోలుడీజిల్.. ఈ ఇంధనాలను కూడా బయటి దేశాల నుంచి రప్పించుకుంటున్నాంఈ దిగుమతుల బిల్లును మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందిదీనిని దృష్టిలో పెట్టుకొనిఇథెనాల్ తయారీలో మనం పురోగతి బాటలో అడుగులు వేస్తున్నాంగత పది సంవత్సరాలలోఇథెనాల్ ఉత్పత్తిసేకరణమిశ్రణం అనేక రెట్లు పెరిగాయిప్రస్తుతంఈ  పనిని చాలావరకు చక్కెర మిల్లులు చేసిపెడుతుంటేవాటి వద్ద నుంచి ఇథెనాల్‌‌ను ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయిఇందులో సహకార సంఘాలు భాగం పంచుకోలేవాఅవి ఎంతగా పాలుపంచుకొంటేఅంతగానూ దీని విస్తృతి అధికమవుతుందిపప్పుధాన్యాల దిగుమతిని తగ్గించే విషయానికి వద్దాం.. మనది వ్యవసాయ ప్రధాన దేశం అయినా మనం పప్పుధాన్యాలను బయటి నుంచే తెచ్చుకొంటున్నాంపప్పుధాన్యాల దిగుమతినీ తగ్గించుకోవడానికిసహకార రంగ పాత్రధారులు సార్థక కృషి చేయొచ్చునాయకత్వ పాత్రను పోషించొచ్చుమనం దిగుమతి చేసుకుంటున్న వాటిలో తయారీకి సంబంధించిన చిన్న చిన్న వస్తువులు కూడా ఎన్నో ఉన్నాయిఅయితే వాటిని సహకార సంఘాల సాయాన్ని తీసుకొని మనం ఇక్కడే ఉత్పత్తి చేయవచ్చు.

మిత్రులారా,

ప్రస్తుతంమనం సేంద్రియ వ్యవసాయానికి కూడా చాలా ప్రాధాన్యాన్ని ఇస్తున్నాంఈ  రంగంలోనూ సహకార సంఘాలు ఒక ముఖ్య భూమికను పోషించ గలుగుతాయిసహకార సంఘాలు ఆహార సంబంధిత సేవలను అందించడంలోశక్తిని అందించడంలోఎరువులను అందించడంలో ఒక ప్రధాన పాత్రను పోషించవచ్చుదీనిలో సహకార సంఘాలు పాలుపంచుకొంటేఫలితాలు వెంటనే వస్తాయిపొలంలోని షెడ్డు పైభాగంలో సౌర ఫలకాలను గాని చిన్న సోలార్ ప్యానళ్లను గాని అమర్చే విషయానికి వద్దాం.. 50-60 మంది రైతులు కలిసిఒక సహకార సంస్థగా ఏర్పడి షెడ్డు పైన సౌర ఫలకాలను అమర్చి విద్యుత్తును ఉత్పత్తి చేసిఆ విద్యుచ్ఛక్తిని రైతులకే  కాక ప్రభుత్వానికి కూడా అమ్మితేనోఈ పనిని ఒక సహకార సంస్థ సులభతరంగా పూర్తి చేయగలుగుతుందిఈ మధ్య కాలంలోబడా బహుళ జాతీయ సంస్థలు ‘గోబర్‌ధన్ యోజన’ అంటే ఆసక్తిని చూపుతున్నాయిఇది కూడా ఒక ప్రముఖ వనరుగా మారబోతోందిసహకార సంఘాలు ఈ రంగంలో ఎందుకు వెనుకబడిపోవాలివ్యర్థాల నుంచి సంపదను సృష్టించే పని అయినాఆవుపేడ నుంచి బయోగ్యాసును తయారు చేయడమైనాసేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేయడం వంటి పనుల్లో తమ పాత్రను పోషించే విషయాన్ని గురించి సహకార సంస్థలు ఆలోచించాలిఇది కూడా ఎరువులకు సంబంధించి మన దేశం దిగుమతి బిల్లును తగ్గించ గలుగుతుందిమన రైతులుచిన్న వాణిజ్య సంస్థల ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా బ్రాండు స్థాయి లభించేలా చేయడానికీ మీరు ఒక  అడుగు ముందుకు వేయాలిగుజరాత్‌నే చూడండిఇదివరకుగుజరాత్‌లో వేర్వేరు పేర్లతో నడుస్తున్న పాడి సంఘాలు అనేకం ఉన్నాయిఇప్పటికి కూడా చాలా డెయిరీలు పనిచేస్తున్నాయికానీ ‘అమూల్’ ఒక బ్రాండుగా ఎదిగిందిఇవాళదీని పేరు ప్రపంచం అంతటా వినిపిస్తోందిమనం కూడా మన వివిధ రకాలైన ఉత్పాదనలకు ఒక ఉమ్మడి బ్రాండును తీసుకు రాగలంమన సిరిధాన్యాలకు.. ‘శ్రీ అన్న’’ పేరిట ఒక బ్రాండును సృష్టించడం మన ధ్యేయం కావాలిప్రపంచంలో ప్రతి డైనింగ్ టేబుల్ మీదా భారత్ బ్రాండు సిరిధాన్యాలు ఎందుకు ఉండకూడదుఈ విషయంలో సహకార సంఘాలు ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలి.            

మిత్రులారా,

పల్లెల ఆదాయాన్ని పెంచడంలో సహకార సంఘాలు కీలక పాత్రను పోషించగలుగుతాయిపాడి రంగంలో ఒక స్పష్ట మార్పు చోటుచేసుకోవడాన్ని మనం చూశాంగత మూడు రోజులుగా నేను సహకార రంగ కార్యక్రమాలలో పాల్గొంటూ వచ్చానుమొదటఅమూల్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అహమదాబాదుకు వెళ్లానునిన్నబనారస్ డెయిరీని ప్రారంభించడానికి బనారస్‌కు వెళ్లాను.  బనారస్‌లో పాడి సహకార సంఘాలు రంగప్రవేశం చేయడంతోమహిళా పాడి రైతుల ఆదాయం అనేక విధాలుగా పెరుగుతోందని గ్రహించానుసహకార సంఘాలు మరో రంగంలోకి అడుగుపెట్టాయితేనె రంగంలోకి రండి అంటూ గుజరాత్ సహకార రంగంలోని వారికి నేను విజ్ఞ‌ప్తి చేశానుమనం శ్వేత క్రాంతిని చూశాంఇక స్వీట్ క్రాంతిని తీసుకువద్దాంమరిమన వాళ్లు తేనె రంగంలో ముందడుగు వేయాలిఈ రంగంలో రైతులు ఎంతటి లాభాన్ని అందుకొంటోందీ మీకు కూడా తెలుసుగత పదేళ్లలోతేనె ఉత్పత్తి 75 వేల మెట్రిక్ టన్నుల నుంచి ఇప్పుడు దాదాపు ఒక లక్షా యాభై వేల మెట్రిక్ టన్నులకు పెరిగిందితేనె ఎగుమతులు కూడా 28 వేల మెట్రిక్ టన్నుల నుంచి దాదాపు 80 వేల మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయిఈ పురోగతిలో నాఫెడ్ట్రైఫెడ్‌లతో పాటు రాష్ట్రాల్లోని కోఆపరేటివ్ సంస్థలు కూడా చాలా పెద్ద పాత్రను పోషించాయిఈ పరిధిని మనం మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది.

మిత్రులారా,

గుజరాత్‌లోపాలను అమ్మి సంపాదించిన డబ్బు ఆడపడుచుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ కావడం మొదలవడంతోనేఅది ఒక అర్థవంతమైన సామాజిక మార్పును తీసుకు రావడాన్ని మనం గమనించాంఇప్పుడు మన సహకార సంఘాలనుమన పీఏసీఎస్‌లనూ కంప్యూటరీకరించడం పూర్తి అయిందికాబట్టిఏ పని చేసినాఎంత మొత్తంలో చెల్లింపులు చోటుచేసుకున్నాఅవి డిజిటల్ వేదిక ద్వారానే జరగాలిముఖ్యంగా సహకార బ్యాంకులు డిజిటల్ సాంకేతికతను త్వరగా అందిపుచ్చుకో గలగాలిభూమి స్వస్థత కార్డు మరో అంశంనేల ఆరోగ్యాన్ని పరీక్షించడం కోసం సాయిల్ టెస్టింగుకు సంబంధించిన ఒక పెద్ద కార్యక్రమాన్ని మేం తీసుకువచ్చాంసహకార సంఘాలూపీఏసీఎస్‌లూ వాటి వాటి ప్రాంతాల్లో చిన్నగా సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని నేను కోరుతున్నావీటి ద్వారా రైతులు తమ భూమి ఆరోగ్యమూఆ మట్టి స్వస్థత స్థితీ ఎలా ఉన్నాయో నిరంతరం పర్యవేక్షించుకుంటూ ఉండే పద్ధతికి అలవాటు పడేటట్టుగా వారిని ప్రోత్సహించాలిభూపరీక్షలకు సంబంధించిన ఒక నెట్‌వర్కును ఏర్పాటు చేసుకొనే స్థాయికి వారు చేరుకోవాలి.    

మిత్రులారా,

సహకార సంఘాల్లో యువతమహిళల భాగస్వామ్యాన్ని పెంచడమెలాఈ విషయంలోనూ మనం మన ప్రయత్నాలను తీవ్రతరం చేయాలిసహకార సంఘంలో పాలుపంచుకొంటున్న రైతులు ఈ విషయంలో తమ ఆలోచనలను పంచుకోగలుగుతారని నేను అనుకుంటున్నానుదీంతో పాటువాళ్లు అందుకోబోయే డివిడెండ్లుతదితర ప్రయోజనాల్లో వారికి చెందిన సహకార సంస్థే భూసార పరీక్షను ఉచితంగా పూర్తి చేసి ఇస్తుందని కూడా వారికి మనం చెప్పవచ్చుభూసార పరీక్ష నుంచి వారు పొందిన అవగాహన మేరకుపంటలపై దృష్టిని కేంద్రీకరించాల్సిందిగా వారికి సూచన చేయాలి.

మిత్రులారా,

ఇది సహకార సంఘాలకు కొత్తదనాన్నిస్తుందిదీంతో ఒక కొత్త శక్తి లభిస్తుందిసహకార సంఘాల్లో నైపుణ్యాభివృద్ధినీశిక్షణనూచైతన్యాన్ని పెంచాల్సిన అవసరం కూడా ఎంతో ఉందిఇప్పటికే చాలా మార్పు వచ్చిందిమరి అన్నింటినీ కాగితాల్లో పేర్కొనాలినోటి మాటలుగా ఎన్నో వాగ్దానాలు చేసిన రోజులు కాలగర్బంలో కలిసిపోయాయిఅందువల్లశిక్షణకు చాలా ప్రాధాన్యాన్ని ఇవ్వాలిఈ విషయంలో ప్రయత్నాలను చేసి తీరాలిపీఏసీఎస్‌లూకోఆపరేటివ్ సొసైటీలు కూడా ఒకదాని నుంచి మరొకటి పాఠాలను నేర్చుకోవాలిఅనేక సహకార సంస్థలు వినూత్న పనులను నిర్వహిస్తున్నాయిఅవి ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నాయిదేశంలో చాలా ప్రాంతాలకు ఈ సంగతి తెలియదుఉత్తమ పద్ధతులను పంచుకొనేందుకు ఒక ఉమ్మడి పోర్టల్‌ను మనం రూపొందించగలమామరి ఈ పోర్టల్‌లో అందరూ తమ కొత్త కొత్త అనుభవాలనుకొత్త కొత్త పద్ధతులను అప్‌లోడ్ చేయవచ్చునుఈ ఉత్తమ పద్ధతులను ఎక్కువ మంది అనుసరించేటట్లు చూడడం ఎలాఆన్‌లైన్‌లో శిక్షణనిచ్చేందుకు ఏర్పాట్లు ఉండాలిదీనికి కొన్ని మాడ్యూళ్లను రూపొందించాలిఅభివృద్ది కోసం తపిస్తున్న జిల్లాల కార్యక్రమంఇది ఆకాంక్షాత్మక జిల్లాలకు సంబంధించిన ప్రచార ఉద్యమందీనిలో ఒక విశేషం ఉందిఈ సంగతి తెలుసా మీకుఆరోగ్యకరమైన పోటీ వ్యవస్థంటూ ఒకటి ఉందిర్యాంకింగుల పద్ధతిని ప్రవేశపెట్టారుదీనిలో ప్రతి రోజూ పది సార్లు ర్యాంకులు పైకీకిందికీ మారుతూ ఉంటాయిప్రతి అధికారీ అనుకుంటారు.. తన జిల్లాయే ముందుకు వెళ్లాలని... సహకార రంగంలో కింది నుంచి పైకి వేర్వేరు స్థాయులను రూపొందిద్దామంటారాఒక్కో రకం కోపరేటివ్ సంస్థకు ఒక్కో రకమైన స్థాయి… ఇలా ఒక వ్యవస్థను రూపొందిస్తేనోమళ్లీ వీటిలోనూ ఆరోగ్యకర పోటీ ఉండాలిసహకార సంస్థల మధ్య ఈ పోటీ ఉండాలిఉత్తమ పనితీరును కనబరిచే వాటికి బహుమతులిచ్చే ఏర్పాటు అవసరంఇలాంటి సహకార సంస్థలు ఒక సరికొత్త ఆవిష్కరణతో ముందుకు రావాలిదానికి ప్రభుత్వంతో పాటు సహకార సంస్థలన్నీ కలిసి కొత్త రూపురేఖలను ఇవ్వగలగాలిఅంత ప్రధానంగా ఉండాలి ఆ ఆవిష్కరణ.        

మిత్రులారా,

సహకార సంస్థల విషయంలో ఎప్పుడూ ఒక ప్రశ్న వస్తుందిసహకార సంఘాల ఎన్నికల్లో పారదర్శకతను తీసుకురావడం ఎంతో అవసరందీంతో ప్రజల్లో నమ్మకం పెరుగుతుందిమరింత మంది సహకార సంఘాల్లో చేరడానికి ముందుకు వస్తారు.
మిత్రులారా,
సహకార సంఘాలను సమృద్ధికి పునాదిగా మార్చడానికిఅవి ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా ఒక్కటొక్కటిగా మా ప్రభుత్వం తగ్గిస్తోందికంపెనీలకు సెస్ తక్కువగా ఉంటేసహకార సంఘాలు మాత్రం ఎక్కువ సెస్సు చెల్లించాల్సి వచ్చిందన్న విషయం మీకు గుర్తుండే ఉంటుందిమేం రూ.1 కోటి నుంచి రూ.10 కోట్ల వరకు ఆదాయాన్ని ఆర్జించే సహకార సంఘాలకు వర్తించే సెస్సును 12 శాతం నుంచి శాతానికి తగ్గించాందీంతో సహకార సంఘాలు వాటి కార్యకలాపాలను కొనసాగించడానికి అందుబాటులో ఉండే నిధులు పెరిగికంపెనీల మాదిరిగానే అవీ ప్రగతి బాట పట్టే అవకాశం లభించిందిసహకార సంఘాలకూకంపెనీలకూ మధ్య కనీస ప్రత్యామ్నాయ పన్ను విషయంలోనూ ఇదివరకు భేద భావం ఉండేదిమేం సహకార సంఘాలకు కనీస ప్రత్యామ్నాయ పన్నును 18 శాతం నుంచి 15 శాతానికి తగ్గించికార్పొరేట్ ప్రపంచంతో సమాన స్థాయికి వాటిని తీసుకు వచ్చాంమరో ఇబ్బంది కూడా ఉండిందిఅది సహకార సంఘాలు రూ.1 కోటి కన్నా ఎక్కువ నగదును విత్‌డ్రా చేసిన సందర్భంలో టీడీఎస్ కట్టాల్సివచ్చేదిమేం ఈ విత్‌డ్రాయల్ పరిమితిని ఏడాదిలో రూ.3 కోట్లకు పెంచాందీంతో ఈ ప్రయోజనాన్ని ఇక సభ్యుల సంక్షేమానికి వినియోగించవచ్చుసహకార సంఘాల విషయంలో మేం తీసుకుంటున్న ఈ సమష్టి చర్యలు దేశ ఉమ్మడి శక్తితో అభివృద్ధికి అన్ని అవకాశాలనూ అందుబాటులోకి తీసుకువస్తాయని నేను నమ్ముతున్నాను.

ఈ ఆకాంక్షతో, మీకు నేను ధన్యవాదాలను తెలియజేస్తున్నానుఅమిత్ భాయి చెప్పినట్లువేర్వేరు చోట్ల లక్షల కొద్దీ ప్రజలు సమావేశమయ్యారుఎంతో ఉత్సాహంతోఆసక్తితో ఈ ముఖ్య కార్యక్రమంలో పాలుపంచుకొన్నందుకు వారికి కూడా నేను ధన్యవాదాలను తెలియజేస్తున్నానువారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించడానికి ఒకరికొకరం సహకారాన్ని అందించుకోవాలనే నిజమైన స్ఫూర్తితోభుజం భుజం కలిపిఅడుగులో అడుగేసి నడుద్దాం.. రండిమనమంతా ఒకే బాటలో ముందుకు సాగుతూఒకదాని వెంట మరొకటిగా ఫలితాలను సాధించుకొందాంమీకు ధన్యావాదాలు.

 

గమనిక: ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఇది.‌

 

***


(రిలీజ్ ఐడి: 2169498) సందర్శకుల సూచీ సంఖ్య : : 27