ప్రధాన మంత్రి కార్యాలయం
జన్మదిన శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించిన అందరికీ ప్రధాని ధన్యవాదాలు
నాడు పోస్టు చేయడమైనది:
17 SEP 2025 8:27PM by PIB Hyderabad
తన 75వ పుట్టిన రోజు సందర్భంగా దేశ విదేశాల నుంచి అసంఖ్యాకంగా శుభాకాంక్షలు, ఆశీస్సులు, ఆప్యాయత నిండిన సందేశాలు అందించిన జనశక్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. వారి ప్రేమ తనకు శక్తిని, స్ఫూర్తిని అందిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:
‘‘జనశక్తికి ధన్యవాదాలు.
దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రేమతో నిండిన అసంఖ్యాకమైన శుభాకాంక్షలు, ఆశీస్సులు, సందేశాలు నన్ను సంతోషంలో ముంచెత్తాయి. ఈ ఆప్యాయత నాకు శక్తినీ, స్ఫూర్తినీ అందిస్తుంది. అందుకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.’’
***
(రిలీజ్ ఐడి: 2167879)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam