ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 17 SEP 2025 3:09PM by PIB Hyderabad

ఈ రోజు తన 75వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నాయకులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

గయానా అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీకి కృతజ్ఞతలు చెబుతూ శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

"ప్రెసిడెంట్ అలీ గారు... మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలుభారత్-గయానా మధ్య ఉన్న లోతైన స్నేహంపరస్పర విశ్వాసాన్ని ప్రతిబింబించిన మీ సంప్రదాయాలూ నన్ను కదిలించాయి."

న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్‌కు కృతజ్ఞతలు చెబుతూ శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

"ప్రధాని లక్సన్ గారూ.. మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు నా ధన్యవాదాలుమన స్నేహాన్ని నేను ఎంతో గౌరవిస్తానువికసిత్ భారత్-2047 దిశగా పురోగమిస్తున్న భారత ప్రయాణంలో న్యూజిలాండ్ ఒక ముఖ్యమైన భాగస్వామి."

ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌కు కృతజ్ఞతలు చెబుతూ శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

"ధన్యవాదాలు మిత్రమాప్రధానమంత్రి అల్బనీస్ గారూ.. ఎంతో ప్రేమతో శుభాకాంక్షలు తెలిపిన మీకు నా ధన్యవాదాలుభారత్-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్నీఇరుదేశాల ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి నేను ఎదురుచూస్తున్నాను."

భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గేకు కృతజ్ఞతలు చెబుతూ శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

"ప్రధాని షెరింగ్ టోబ్గే గారూ.. మీరు ఎంతో ప్రేమతో తెలిపిన శుభాకాంక్షలకు ధన్యవాదాలుభూటాన్‌తో మా ప్రత్యేక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మీతో కలిసి పనిచేయడం కోసం నేను ఎదురు చూస్తున్నాను."

డొమినికా ప్రధానమంత్రి రూజ్‌వెల్ట్ స్కెరిట్‌కు కృతజ్ఞతలు చెబుతూ శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

"ప్రధానమంత్రి స్కెరిట్ గారూ.. మీ ప్రేమపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలుడొమినికా కామన్వెల్త్‌తో బలమైన స్నేహంసంఘీభావ సంబంధాలను భారత్ ఎంతో గౌరవిస్తుంది."

 

***


(Release ID: 2167799) Visitor Counter : 2