ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో టెలిఫోన్ లో మాట్లాడిన డెన్మార్క్ ప్రధానమంత్రి శ్రీమతి మెట్టే ఫ్రెడరిక్సన్
భారత్, డెన్మార్క్ మధ్య హరిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం
చేయడానికి నిబద్ధతను పునరుద్ఘాటించిన నేతలు
ఉక్రెయిన్ లో సంఘర్షణకు శాంతియుత, సత్వర పరిష్కారంపై అభిప్రాయాలను పంచుకున్న నాయకులు
భారత్ - ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని త్వరితగతిన
ఖరారు చేయడానికి మద్దతు ప్రకటించిన ప్రధాని ఫ్రెడరిక్సన్
Posted On:
16 SEP 2025 7:41PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు డెన్మార్క్ ప్రధానమంత్రి గౌరవ మెట్టే ఫ్రెడరిక్సన్తో టెలిఫోన్ లో మాట్లాడారు.
వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఇంధనం, జల నిర్వహణ, ఆహార ప్రాసెసింగ్, సుస్థిర అభివృద్ధి వంటి రంగాలలో భారత్ - డెన్మార్క్ మధ్య హరిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరువురు నాయకులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ కు డెన్మార్క్ అధ్యక్ష బాధ్యత, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో డెన్మార్క్ శాశ్వతేతర సభ్యత్వం సఫలం కావాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆకాంక్షించారు.
ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలను గురించి కూడా నేతలు చర్చించారు. ఉక్రెయిన్ సంఘర్షణకు శాంతియుత పరిష్కారానికి, ఆ దేశంలో త్వరితగతిన శాంతి, సుస్థిరతల పునరుద్ధరణకు భారత్ మద్దతును ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
పరస్పర ప్రయోజనకరమైన భారత్ - ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేయడానికి, 2026 లో భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ విజయవంతం కావడానికి డెన్మార్క్ ప్రధాని గౌరవ ఫ్రెడరిక్సన్ గట్టి మద్దతును ప్రకటించారు.
(Release ID: 2167399)
Visitor Counter : 4
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam