ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్పీడ్ స్కేటింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్ - 2025లో స్వర్ణాన్ని గెలిచిన శ్రీ ఆనంద్‌కుమార్ వేల్‌కుమార్.. స్కేటింగ్‌లో భారత మొట్టమొదటి ప్రపంచ చాంపియన్ శ్రీ వేల్‌కుమార్‌యే.. అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 16 SEP 2025 8:45AM by PIB Hyderabad

స్పీడ్ స్కేటింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్ - 2025లో భాగంగా నిర్వహించిన ‘సీనియర్ పురుషుల 1000 మీటర్ల స్ప్రింట్ పోటీ’లో స్వర్ణ పతకాన్ని శ్రీ ఆనంద్‌కుమార్ వేల్‌కుమార్ గెలిచిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. ‘‘ఆయన కనబరిచిన దృఢచిత్తం, వేగం, ఉత్సాహం.. ఇవే స్కేటింగ్‌లో భారత ప్రప్రథమ ప్రపంచ చాంపియన్‌గా నిలిపాయి. ఆయన సాధించిన ఈ విజయం ఎంతో మంది యువజనులకు స్ఫూర్తినిస్తుంది’’ అని శ్రీ మోదీ ప్రశంసించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ రోజు ఒక  సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:

‘‘స్పీడ్ స్కేటింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్ - 2025లో భాగంగా నిర్వహించిన ‘సీనియర్ పురుషుల 1000 మీటర్ల స్ప్రింట్ పోటీ’లో స్వర్ణ పతకాన్ని గెలిచిన ఆనంద్‌కుమార్ వేల్‌కుమార్‌ను చూస్తే గర్వంగా  ఉంది. ఆయన చాటిన దృఢచిత్తం, వేగం, ఉత్సాహం.. ఇవి స్కేటింగ్‌లో భారత ప్రప్రథమ ప్రపంచ చాంపియన్‌గా ఆయనను నిలబెట్టాయి. ఆయన సాధించిన ఈ విజయం ఎంతో మంది యువజనులకు స్ఫూర్తిని ఇస్తుంది. ఆయనకు ఇవే అభినందనలు. రాబోయే కాలంలో ఆయన మరింత రాణించాలని నేను ఆకాంక్షిస్తున్నాను.’’‌

 

 

 

***

MJPS/VJ


(रिलीज़ आईडी: 2167043) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , Bengali-TR , Malayalam , English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada