ప్రధాన మంత్రి కార్యాలయం
గ్రేట్ నికోబార్ ఐలండ్ ప్రాజెక్టుపై వ్యాసాన్ని ప్రజలతో పంచుకొన్న ప్రధానమంత్రి
ఇక నౌకా వాణిజ్యానికీ, విమానయానానికీ ప్రధాన కూడలి
Posted On:
12 SEP 2025 1:02PM by PIB Hyderabad
గ్రేట్ నికోబార్ ఐలండ్ ప్రాజెక్టు విశేషాలను వివరించిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో ఈ రోజు పంచుకొన్నారు. ఈ ప్రాజెక్టు వ్యూహాత్మక, రక్షణపరంగా జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ప్రాంతం హిందూ మహాసముద్రంలో నౌకా వాణిజ్యానికీ, విమానయానానికీ ఇక ముందు ప్రధాన కూడలిగా మారుతుంది.
కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో నమోదు చేసిన ఒక సందేశానికి ప్రధానమంత్రి ప్రతిస్పందించారు:
‘‘గ్రేట్ నికోబార్ ఐలండ్ ప్రాజెక్టు విశేషాలను కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ (@byadavbjp) వివరించారు. ఈ ప్రాజెక్టు వ్యూహాత్మక, రక్షణ, జాతీయ ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది. హిందూ మహాసముద్రంలో నౌకా వాణిజ్యానికీ, విమానయానానికీ ఒక ప్రధాన కూడలిగా ఈ ప్రాంతం మారనున్నది. ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం పరస్పర పూరకంగా నిలిచేందుకు ఈ ప్రాజెక్టు ఒక ప్రధాన ఉదాహరణగా నిలుస్తుందని ఆయన అన్నారు’’ అని పేర్కొన్నారు.
***
(Release ID: 2166170)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam