ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్ – మారిషస్ సంయుక్త ప్రకటన: ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ

Posted On: 11 SEP 2025 1:53PM by PIB Hyderabad

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు గౌరవ మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రాం గూలం భారత్‌లో అధికారికంగా పర్యటించారువిస్తృత శ్రేణి ద్వైపాక్షిక అంశాలపై ప్రధానమంత్రులిద్దరూ ఫలవంతంగా చర్చించారుమారిషస్ ప్రభుత్వ అభ్యర్థనల ఆధారంగా.. భారత్మారిషస్ సంయుక్తంగా కింది ప్రాజెక్టుల అమలుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి.

గ్రాంట్ ప్రాతిపదికన చేపట్టాల్సిన ప్రాజెక్టులు/సాయం:

I. కొత్త సర్ సీవూసగూర్ రాంగూలం నేషనల్ హాస్పిటల్.

II. ఆయుష్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్.

III. పశువైద్య పాఠశాలజంతువుల ఆస్పత్రి.

IV. హెలికాప్టర్ల ఏర్పాటు.

ఈ ప్రాజెక్టులుఅభ్యర్థించిన సాయం కోసం దాదాపు 215 మిలియన్ డాలర్లు (9.80 బిలియన్ల మారిషస్ రూపాయలుఖర్చు అవుతాయని అంచనా.

గ్రాంట్-కమ్-ఎల్ఓసీ ప్రాతిపదికన చేపట్టాల్సిన ప్రాజెక్టులుఅందించాల్సిన సాయం

I. ఎస్ఎస్ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త ఏటీసీ టవర్ నిర్మాణ పనులను పూర్తి చేయడం.

II. ఎం-4 మోటార్ వే అభివృద్ధి.

III. రెండో దశ రింగ్ రోడ్డు అభివృద్ధి.

IV. సీహెచ్సీఎల్ ద్వారా పోర్ట్ పరికరాల కొనుగోలు.

ఈ ప్రాజెక్టులు/సాయం అంచనా వ్యయం దాదాపు 440 మిలియన్ డాలర్లు/ 20.10 బిలియన్ల మారిషస్ రూపాయలు.

2. వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా ఇరు పక్షాలు కింది అంశాలపై సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చాయి:

I. మారిషస్లో ఓడరేవు పునరభివృద్ధిపునర్నిర్మాణం;

II. చాగోస్ సముద్ర రక్షిత ప్రాంత అభివృద్ధినిఘాలో సాయం.


3. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం 25 మిలియన్ డాలర్ల బడ్జెట్ సాయాన్ని అందించడంపైనా సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది.

 

*** 


(Release ID: 2165702) Visitor Counter : 2