ప్రధాన మంత్రి కార్యాలయం
‘ఉపరాష్ట్రపతి ఎన్నిక-2025’లో శ్రీ సీపీ రాధాకృష్ణన్ గెలిచిన సందర్భంగా అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
09 SEP 2025 8:23PM by PIB Hyderabad
‘ఉపరాష్ట్రపతి ఎన్నిక-2025’లో శ్రీ సీపీ రాధాకృష్ణన్ గెలిచిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఈ రోజు అభినందనలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘ఉపరాష్ట్రపతి ఎన్నిక-2025లో గెలిచిన సందర్భంగా శ్రీ సీపీ రాధాకృష్ణన్ గారికి అభినందనలు. ఆయన సమాజ సేవతో పాటు పేదలు, ఆదరణకు నోచుకోని వర్గాలకు సాధికారతను కల్పించేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు. రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ, పార్లమెంటరీ సంప్రదాయాలను సమున్నత స్థాయిలో నిలబెడుతూ ఓ విశిష్ట ఉపరాష్ట్రపతిగా ఆయన పేరు తెచ్చుకొంటారని నేను నమ్ముతున్నాను.
@CPRGuv’’
(रिलीज़ आईडी: 2165195)
आगंतुक पटल : 37
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Marathi
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati